వికారాబాద్ జిల్లాలో మరో ఘోర ప్రమాదం.. ఒకరు మృతి.. నలుగురికి సీరియస్!
వికారాబాద్ జిల్లాలో బస్సు ప్రమాదం ఘటన మరువకముందే మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటీవల చేవెళ్ల బస్సు ఘటనలో 19 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి సరిగ్గా రెండు రోజులు గడవక ముందే వికారాబాద్ జిల్లా కేంద్రంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి స్థానిక ఎస్ఏపీ కాలేజీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

వికారాబాద్ జిల్లాలో బస్సు ప్రమాదం ఘటన మరువకముందే మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటీవల చేవెళ్ల బస్సు ఘటనలో 19 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి సరిగ్గా రెండు రోజులు గడవక ముందే వికారాబాద్ జిల్లా కేంద్రంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం (నవంబర్ 4) రాత్రి స్థానిక ఎస్ఏపీ కాలేజీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
వేగంగా దూసుకొచ్చిన కారు.. ముందు వెళ్తున్న స్కూటీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. స్కూటీని ఢీకొట్టిన తర్వాత కారు.. మరోమారు వాహనదారులపైకి దూసుకెళ్లింది. దీంతో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్కూటీపై వెళ్తున్న వారిని వికారాబాద్ పట్టణానికి చెందిన భారతి, ఆమె భర్త తులసిరామ్‌గా పోలీసులు గుర్తించారు. వికారాబాద్ అనంతగిరిగుట్ట జాతర సందర్భంగా చిరు వ్యాపారం చేయడానికి వచ్చి ఈ ప్రమాదానికి గురయ్యారు. భారతీ అక్కడికక్కడే మృతి చెందగా, తులసిరామ్ పరిస్థితి విషమంగా ఉండటంతో వికారాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఇతర వాహనదారులను కర్నూలు జిల్లాకు చెందిన శీను, లక్ష్మణ్, చిన్నగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
