AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CA Top Ranker 2025: సీఏ ఫైనల్ ఫలితాల్లో హైదరాబాద్‌ కుర్రాడి సత్తా.. ఏకంగా ఆల్‌ ఇండయా సెకండ్‌ ర్యాంకు!

CA AIR 2 Tejas Mundada: తాజాగా వెల్లడించిన సీఎ ఫలితాల్లో హైదరాబాద్‌కి చెందిన విద్యార్థి తేజస్‌ ముందాడ జాతీయ స్థాయిలో ఏకంగా రెండో ర్యాంకు సాధించాడు. ఫైనల్ పరీక్షల్లో తేజస్‌ 600 మార్కులకు ఏకంగా 492 మార్కులు అంటే 82 శాతం సాధించి ఆల్ ఇండియా రెండో ర్యాంకు పొందాడు..

CA Top Ranker 2025: సీఏ ఫైనల్ ఫలితాల్లో హైదరాబాద్‌ కుర్రాడి సత్తా.. ఏకంగా ఆల్‌ ఇండయా సెకండ్‌ ర్యాంకు!
CA AIR 2 Ranker Tejas Mundada
Srilakshmi C
|

Updated on: Nov 05, 2025 | 9:05 AM

Share

హైదరాబాద్‌, నవంబర్‌ 5: చార్టెర్డ్‌ ఎకౌంటెంట్‌ (సీఏ) ఫైనల్‌ రిజల్ట్స్‌ ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) తాజాగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫౌండేషన్, ఇంటర్మీడియేట్, ఫైనల్ కోర్సుల ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. విద్యార్ధులు తమ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 2025లో దేశవ్యాప్తంగా నిర్వహించని నిర్వహించిన ఈ పరీక్షలకు వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఏడాది సీఏ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గత ఏడాది కంటే కాస్త మెరుగ్గా ఉన్నట్లు ICAI అధికారులు వెల్లడించింది.

ఇక తాజాగా వెల్లడించిన సీఎ ఫలితాల్లో హైదరాబాద్‌కి చెందిన విద్యార్థి తేజస్‌ ముందాడ జాతీయ స్థాయిలో ఏకంగా రెండో ర్యాంకు సాధించాడు. ఫైనల్ పరీక్షల్లో తేజస్‌ 600 మార్కులకు ఏకంగా 492 మార్కులు అంటే 82 శాతం సాధించి ఆల్ ఇండియా రెండో ర్యాంకు పొందాడు. కాగా గత సెప్టెంబరులో జరిగిన సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్‌ పరీక్షలకు దేశవ్యాప్తంగా 1,01,028 మంది హాజరయ్యారు. వారిలో 11,466 మంది ఉత్తీర్ణత సాధించారు. గతంలో సీఏ ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో తేజస్‌ 5వ ర్యాంకు సాధించడం విశేషం. తేజస్‌ తండ్రి, సోదరుడు కూడా సీఏలే.

తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానంపై సర్కార్ కమిటీ.. 3 నెలల్లో నివేదిక

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై ఇప్పటికే ప్రైవేట్‌ కాలేజీలు అన్నీ బంద్‌ నిర్వహిస్తున్న సంగతి తెలసిందే. దీనిపై దిగొచ్చిన రేవంత్ సర్కార్ అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ జీవో గత నెల 28వ తేదీనే జారీ చేసింది. తాజాగా ఈ విషయం వెల్లడించింది. సంక్షేమశాఖ ప్రత్యేక సీఎస్‌ ఛైర్మన్‌గా, ప్రొఫెసర్‌ కోదండరాం, కంచ ఐలయ్య, ఆర్థిక, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖల కార్యదర్శులు, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌తో పాటు ఉన్నత విద్యాసంస్థల నుంచి మరో ముగ్గురు ప్రతినిధులను ఈ కమిటీలో సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పాలసీపై కమిటీ 3 నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వనుంది. విద్యా సంస్థలు పేర్కొన్న సూచనలపై కూడా కమిటీ అధ్యయనం చేయనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..