విపక్షాలకు అస్త్రంగా కాంగ్రెస్‌లో మొదలైన మరో సమస్య.. ఏంటా సమస్య?
కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు నుంచి అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ నుంచి ఒకే డైలాగ్ వినిపించేది. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని.. వాళ్లల్లో వాళ్లే కొట్టుకుని రేవంత్‌ను గద్దె దించుతారని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాట్లాడారు. కేటీఆర్ ఓ అడుగు ముందుకేసి.. సీఎం పక్కలోనే పొంగులేటి బళ్లెం ఉందని విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని కూలుస్తారట అని సీఎం రేవంత్ కూడా అప్పట్లో పదే పదే మాట్లాడారు. కానీ పార్లమెంట్ ఎన్నికల ముగిశాక.. ప్రభుత్వం పడిపోతుందన్న

కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు నుంచి అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ నుంచి ఒకే డైలాగ్ వినిపించేది. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని.. వాళ్లల్లో వాళ్లే కొట్టుకుని రేవంత్‌ను గద్దె దించుతారని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాట్లాడారు. కేటీఆర్ ఓ అడుగు ముందుకేసి.. సీఎం పక్కలోనే పొంగులేటి బళ్లెం ఉందని విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని కూలుస్తారట అని సీఎం రేవంత్ కూడా అప్పట్లో పదే పదే మాట్లాడారు. కానీ పార్లమెంట్ ఎన్నికల ముగిశాక.. ప్రభుత్వం పడిపోతుందన్న ఊసే ఎత్తలేదు అన్ని పార్టీల నేతలు. కానీ ఇప్పుడదే బీఆర్ఎస్, బీజేపీ నేతల స్వరం మారింది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని.. చెప్తున్నారు.ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉందంటున్నారు కేటీఆర్. అప్పటి వరకు వెయిట్ చేస్తాం.. ప్రభుత్వాన్ని హమీలపై క్షేత్రస్థాయిలో నిలదీస్తామని చెప్తున్నారు.
ప్రభుత్వం పడిపోవాలన్న తొందర తమకేం లేదన్నారు కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇంకో మూడున్నరేళ్లు తాము వెయిట్ చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పాలన, కాంగ్రెస్ పాలన తెలంగాణ ప్రజలు చూశారని, వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు కిషన్ రెడ్డి.
విపక్ష నేతల స్వరంలో మార్పు, ప్రభుత్వం పడిపోతుందన్న బాధ లేకున్నా.. కాంగ్రెస్‌లో రోజుకో పంచాయతీతో పాటు.. తాజాగా 8మంది ఎమ్మెల్యేల భేటీ విపక్షాలకు మరో అస్త్రం ఇచ్చినట్లైంది. ఇప్పుడిదే.. సీఎం రేవంత్‌కు మరో టెన్షన్ క్రియేట్ చేసింది. మరోవైపు.. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోం అంటూ.. ప్రభుత్వ వ్యతిరేకత ఎమ్మెల్యేలకు అర్థం అయిందంటున్నారు ఎంపీ ఈటల లాంటి నాయకులు.