Harish Rao: రానున్న రోజుల్లో తెలంగాణలో 50 వేల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి హరీష్‌రావు

Harish Rao: తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, రానున్న రోజుల్లో మరో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి...

Harish Rao: రానున్న రోజుల్లో తెలంగాణలో 50 వేల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి హరీష్‌రావు
Harish Rao
Follow us

|

Updated on: Apr 05, 2021 | 1:57 PM

Harish Rao: తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, రానున్న రోజుల్లో మరో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో మోడల్‌ జిల్లా గ్రంథాలయ భవనాన్ని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. పుట్టింది మొదలు మరణించే వరకు మనిషి నిరంతర విద్యార్థి అని అన్నారు. నేషనల్‌ లెవల్‌లో పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థులకు ఈ మోడల్‌ జిల్లా గ్రంథాలయం బాగా ఉపయోగపడుతుందని అన్నారు. డిజిటల్‌ లైబ్రరీలో మొత్తం 13 కంప్యూటర్లు ఉన్నాయని, ఉచిత ఇంటర్నెట్‌తో వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. దీనిని నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీకి లింక్‌ చేశామని పేర్కొన్నారు.

అన్ని రకాల బుక్‌లు, లైవ్‌ విజువల్స్‌, ఇంటర్‌ నేషనల్‌ జర్నల్స్‌ అందుబాటులో ఉంటాయని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. విద్యార్థులు తమకు కావాల్సిన పుస్తకాలు ఏమిటో తెలిపితే వాటిని తప్పకుండా తీసుకువస్తామని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందిందని, రాష్ట్రం అభివృద్ధి పనుల్లో దూసుకుపోతుందని తెలిపారు.

ఇవీ చదవండి: Bernard Taupie: అర్థరాత్రి బీభత్సం… మాజీ మంత్రిని తాళ్లతో కట్టేసి దుండుగల దాడి.. భారీగా చోరీ

Robot artist: ఏం క్రియేటివిటి గురూ.. ఈ రోబో వేసిన పెయింటింగ్‌ ఎంత ధర పలికిందో తెలిస్తే షాకవుతారు..!

చిట్టీల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసిన మహిళ.. రూ.4.5 కోట్లు టోకరా.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు