Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిట్టీల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసిన మహిళ.. రూ.4.5 కోట్లు టోకరా.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు

ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు జనాల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నిలువునా మోసగిస్తున్నారు. చిట్టీల పేరుతో, రుణాల పేరుతో ఇలా ఎన్నో రకాలుగా లక్షల్లో...

చిట్టీల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసిన మహిళ.. రూ.4.5 కోట్లు టోకరా.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు
Woman Cheats
Follow us
Subhash Goud

|

Updated on: Apr 05, 2021 | 1:40 PM

ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు జనాల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నిలువునా మోసగిస్తున్నారు. చిట్టీల పేరుతో, రుణాల పేరుతో ఇలా ఎన్నో రకాలుగా లక్షల్లో టోకరా వేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ మహిళ చిట్టీల పేరుతో రూ.4.5 కోట్లు వసూలు చేసి పరారైంది. తీరా మోసపోయామని భావించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… హయత్‌నగర్‌ పరిధి ప్రగతినగర్‌కు చెందిన సప్పిడి పూలమ్మకొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం నడుపుతోంది. స్థానికంగా సొంత ఇల్లు కూడా ఉంది. చుట్టుపక్కల వాళ్లతో ఎంతో నమ్మకంగా మెదులుతూ అధిక వడ్డీల ఆశ చూపి వారి నుంచి చిన్న చిన్న మొత్తాలను సేకరించింది. కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం నడుపుతుండటంతో నమ్మిన చాలా మంది ఆమెకు చిట్టీలు కట్టారు. కొందరు చిట్టీలు ఎత్తుకుని తిరిగి ఆమె రూ.2 చొప్పున వడ్డీ ఇస్తుంటుంది. ఇలా డబ్బులు సర్దుబాటు చేస్తూ అప్పులు చేసి దాదాపు రూ.4.5 కోట్లు వసూలు చేసింది.

గత కొంతకాలంగ పూలమ్మ చిట్టీలు ఎత్తినవారికి, అప్పులవారికి డబ్బులు ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ వారికి కనిపించకుండా పోయింది. ఆమె కనిపించకపోవడంతో ఆమె ఇంటి వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. ఇంట్లో లేకపోవడంతో ఆమె కుమారుడు నరేష్‌ను డబ్బులు ఇవ్వాల్సిందిగా బాధితులు డిమాండ్‌ చేశారు.

దీంతో కుమారుడు నరేష్‌ తనకు సంబంధంలేదని చెప్పడంతో దాదాపు 70 బాధితులు ఆదివారం హయత్‌నగర్ పోలీసులను ఆశ్రయంచి పిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వారు వాడుకున్నారు.

ఇవీ చదవండి: Bernard Taupie: అర్థరాత్రి బీభత్సం… మాజీ మంత్రిని తాళ్లతో కట్టేసి దుండుగల దాడి.. భారీగా చోరీ

Robot artist: ఏం క్రియేటివిటి గురూ.. ఈ రోబో వేసిన పెయింటింగ్‌ ఎంత ధర పలికిందో తెలిస్తే షాకవుతారు..!