Fake Order: తెలంగాణలో లాక్‌డౌన్‌ అంటూ నకిలీ ఉత్తర్వులు.. సోషల్‌ మీడియాలో వైరల్‌.. ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు

Fake Order: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తున్నారంటూ నకిలీ ఉత్తర్వులు తయారు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సోమవారం.

Fake Order: తెలంగాణలో లాక్‌డౌన్‌ అంటూ నకిలీ ఉత్తర్వులు.. సోషల్‌ మీడియాలో వైరల్‌.. ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు
arrest
Follow us
Subhash Goud

|

Updated on: Apr 05, 2021 | 2:17 PM

Fake Order: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తున్నారంటూ నకిలీ ఉత్తర్వులు తయారు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ వివరాలు మీడయాకు వెల్లడించారు. నాలుగు రోజుల కిందట శ్రీపతి సంజీవ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఈ నకిలీ జీవోను తయారు చేసినట్లు తెలిపారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో రాత్రి వేళల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్నారంటూ నకిలీ జీవో తయారు చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారని అన్నారు. నిందితుడి నుంచి ఓ ల్యాప్‌టాప్‌, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు. నిందితుడు ఓ ప్రైవేటు కంపెనీలో ఛార్టెడ్‌ అకౌంట్‌గా పని చేస్తున్నాడని, ఆయన స్వస్థలం నెల్లూరు పట్టణమని గుర్తించినట్లు చెప్పారు.

లాక్‌డౌన్‌పై గతంలో ఇచ్చిన జీవోను డౌన్‌లోడ్‌ చేసుకుని తేదీలు మార్చి, పాత జీవోను అతని స్నేహితులు వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేశారని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సీపీ అంజనీకుమార్‌ సూచించారు. ప్రధానంగా వాట్సాప్‌ గ్రూపుల్లో అడ్మిన్స్‌గా ఉన్నవారంతా నిజాలు తెలుసుకున్న తర్వాతే సమాచారాన్ని ఫార్వర్డ్‌ చేయాలని సూచించారు. లేదంటే వారిపై కేసుల నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. కాగా, ఇలాంటివి ఫేక్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో ఎన్నో వైరల్‌ అవుతుంటాయి. ఇలాంటి వాటిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వైరల్‌ అవుతున్న ఫేక్‌ న్యూస్‌పై దర్యాప్తు జరుపుతూ నిందితులపై కేసులు నమోదు చేస్తున్నారు.

ఇవీ చదవండి: చిట్టీల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసిన మహిళ.. రూ.4.5 కోట్లు టోకరా.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు

Bernard Taupie: అర్థరాత్రి బీభత్సం… మాజీ మంత్రిని తాళ్లతో కట్టేసి దుండుగల దాడి.. భారీగా చోరీ

Robot artist: ఏం క్రియేటివిటి గురూ.. ఈ రోబో వేసిన పెయింటింగ్‌ ఎంత ధర పలికిందో తెలిస్తే షాకవుతారు..!

టీమిండియాకు షాక్.. ఆ విషయంలో బీసీసీఐని వివరణ కోరిన ఐసీసీ..
టీమిండియాకు షాక్.. ఆ విషయంలో బీసీసీఐని వివరణ కోరిన ఐసీసీ..
పుష్ఫ 2 సినిమాకి డబ్బింగ్ పూర్తి చేసుకున్న షెకావత్ సార్
పుష్ఫ 2 సినిమాకి డబ్బింగ్ పూర్తి చేసుకున్న షెకావత్ సార్
కంటెంట్ ఉంటే కోట్లు.. లేదంటే పాట్లు.. చిన్న సినిమాలపై చిరు
కంటెంట్ ఉంటే కోట్లు.. లేదంటే పాట్లు.. చిన్న సినిమాలపై చిరు
డాక్టర్‌ లేకపోవడంతో... ఈ వాచ్‌మెనే ఇలా వైద్యుడు అయ్యాడు
డాక్టర్‌ లేకపోవడంతో... ఈ వాచ్‌మెనే ఇలా వైద్యుడు అయ్యాడు
తంతే బకెట్ బిర్యానీలో పడ్డారు.. కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు
తంతే బకెట్ బిర్యానీలో పడ్డారు.. కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు
పగలేమో పనోళ్లు.. రాత్రయితే ఆయుధ వ్యాపారులు
పగలేమో పనోళ్లు.. రాత్రయితే ఆయుధ వ్యాపారులు
ఫేక్ న్యూస్ ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా మారుతోంది: మంత్రి
ఫేక్ న్యూస్ ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా మారుతోంది: మంత్రి
ఐపీఎల్ మెగా వేలంలో ఐదుగురు వెటరన్ ప్లేయర్లు..
ఐపీఎల్ మెగా వేలంలో ఐదుగురు వెటరన్ ప్లేయర్లు..
టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆసీస్‌కు ఆ స్టార్ పేసర్
టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆసీస్‌కు ఆ స్టార్ పేసర్
బండి ఎక్స్‌పెయిరీ అయితే మాత్రం OLXలో కూడా అమ్మేందుకు వీలు లేదట
బండి ఎక్స్‌పెయిరీ అయితే మాత్రం OLXలో కూడా అమ్మేందుకు వీలు లేదట