Hyderabad: జలసౌధలో హాట్‌ హాట్‌గా సుధీర్ఘ సమావేశం.. ఫైనల్‌గా నీటి పంపకాలపై ఏం తేల్చారంటే..

Hyderabad: కృష్ణా నదిలో తెలంగాణ ప్రభుత్వం 50 శాతం నీటి వాటా కావాలని అడిగిందని ఏపీ జనవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్యామలరావు తెలిపారు.

Hyderabad: జలసౌధలో హాట్‌ హాట్‌గా సుధీర్ఘ సమావేశం.. ఫైనల్‌గా నీటి పంపకాలపై ఏం తేల్చారంటే..
Jalasoudha
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 02, 2021 | 7:03 AM

Hyderabad: కృష్ణా నదిలో తెలంగాణ ప్రభుత్వం 50 శాతం నీటి వాటా కావాలని అడిగిందని ఏపీ జనవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్యామలరావు తెలిపారు. అయితే, ఏపీ తరఫున 70 శాతం వాటా ఇవ్వాలని కోరామన్నారు. బుధవారం నాడు హైదరాబాద్‌లోని జలసౌధలో కేఆర్ఎంబీ, జీఆర్ఎంసీ సమావేశం సుధీర్ఘంగా సాగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు మీడియాతో మాట్లాడారు.

ఇవాళ జరిగిన సమావేశంలో 34:66 నిష్పత్తిలో కృష్ణా జలాలను వాడుకోవాలని నిర్ణయించడం జరిగిందని ఏపి జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్యామలరావు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తితో శ్రీశైలం నుంచి వందకు పైగా టీఎంసీల నీటిని వృధా చేశారని ఆరోపించారు. పవర్ పేరుతో నీటిని వృధా చేయడాన్ని బోర్డు కూడా ఒప్పుకోలేదని చెప్పారు. పవర్ ఉత్పత్తి ని ఆపాలని బోర్డు చైర్మన్ ఆదేశించినట్లు తెలిపారు. వరద నీటి వినియోగం పై అభ్యంతరం లేదని సూచించడం జరిగిందన్నారు. ఇక కేఆర్ఎంబి, జీఆర్ఎంబి గెజిట్ నోటిఫికేషన్ ను అక్టోబర్ 14వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు శ్యామలరావు వెల్లడించారు.

అయితే, క్యారీ ఓవర్ తమ అకౌంట్లో పెట్టాలని తెలంగాణ కోరుతోందన్నారు. వినియోగంలోకి రాని వాటర్ ను రెండు రాష్ట్రాలు వినియోగించుకోవాలని ఏపీ కోరుతుందని చెప్పారు. అయితే, గతంలో ఎలా ఉందో ప్రస్తుతం కూడా అలానే ఉండాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇరు రాష్ట్రాల్లో నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్ లను అడిగారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం గతంలో చేపట్టినవే కొనసాగిస్తున్నట్లు తెలిపామన్నారు. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం ఇరు రాష్ట్రాల్లో ఆరు ప్రాజెక్టులు చేపట్టగా ఏపీ లో నాలుగు, తెలంగాణ లో రెండు ఉన్నాయని పేర్కొన్నారు. వాటికి అనుమతులు లేదనడం సమంజసంకాదన్నారు.

ఇదే అంశంపై తెలంగాణ నీటి పారుదలశాఖ కార్యదర్శి రజత్ కుమార్ కూడా మీడియాతో మాట్లాడారు. నీళ్ల కేటాయింపులో న్యాయబద్దమైన వాటా అడిగామన్నారు. 50శాతం అడగలేదు కానీ.. సరైన కేటాయింపులు చేయాలని కోరామన్నారు. అన్యాయం జరిగితే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని, ట్రిబ్యునల్ ను ఆశ్రయిస్తామని చెప్పారు. శ్రీశైలం జలవిద్యుత్ పై కేఆర్ఎంబికి ఎలాంటి అర్హత లేదని రజత్ కుమార్ స్పష్టం చేశారు. గోదావరి పై ఎలాంటి గొడవలేదని, జీఆర్ఎంబిలో పది ప్రాజేక్టులు ఉన్నాయన్నారు. వీటిలో ఇప్పటికే ఏడు పూర్తి అవగా.. మూడింటి డీపీఆర్‌లు జీఆర్ఎంబీకి సమర్పించడం జరిగిందని రజత్ కుమార్ తెలిపారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.

అయితే, నీళ్ల కేటాయింపుల విషయంలో బోర్డు ఆలోచించాల్సిన అవసరం ఉందని రజత్ కుమార్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి.. కేఆర్ఎంబి, జీఆర్ఎంబి లకు సబ్ కమిటీ లు వేయాలన్నారు. ఫీల్డ్‌ను సందర్శించాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రస్తుత ఏడాది నీటి పంపకాలు గత సంవత్సరం మాదిరిగానే ఉంటుందని చెప్పిన ఆయన.. జలవిద్యుత్ మాత్రం ఉత్పత్తి చేస్తామని తేల్చి చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం అని ఆయన పేర్కొన్నారు.

Also read:

Horoscope Today: ఈరాశుల వారికి ఉద్యోగాల్లో సమస్యలు.. ఖర్చులు అధికం.. ఈరోజు రాశిఫలాలు..

Pawan Kalyan Birthday: పవన్‌ కళ్యాణ్‌కు పవర్‌ స్టార్‌ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా.? ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

Andhra Pradesh: వారికి తెలియకుండానే అకౌంట్ల నుంచి మాయం అయిన నిధులు.. అసలేం జరుగుతోంది..