TRS Bhavan: టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో విజయం.. దేశరాజధానిలో TRS భవనం.. ఇవాళ సీఎం కేసీఆర్ భూమిపూజ

దేశ రాజధాని ఢిల్లీలో TRS పార్టీ కార్యాలయం కల సాకారం కాబోతోంది. నూతన భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

TRS Bhavan: టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో విజయం.. దేశరాజధానిలో TRS భవనం.. ఇవాళ సీఎం కేసీఆర్ భూమిపూజ
Telangana Bhavan In Delhi,

TRS Bhavan in Delhi: ఎన్నాళ్లో వేచిన ఉదయం.. దేశ రాజధాని ఢిల్లీలో TRS పార్టీ కార్యాలయం కల సాకారం కాబోతోంది. నూతన భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. పార్టీ ఆఫీస్‌ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా చేసేలా ఏర్పాట్లు చేస్తోంది టీఆర్ఎస్. ముఖ్యనేతలంతా ఢిల్లీ చేరుకున్నారు.

తమకంటూ రాష్ట్రం కావాలని తెలంగాణ బిడ్డడు ఢిల్లీలో బలిదానం చేసుకుంటే, కనీసం అతడి మృతదేహాన్ని కూడా ఏపీ భవన్‌లోకి రానీయలేదు. తెలంగాణ సమాజం ఇటువంటి గాయాలనెన్నింటినో పంటి బిగువున అనుభవించింది. ఒక రాష్ర్టానికి చెందిన వ్యక్తికి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లే అవసరం వస్తే.. ఉండే విధంగా అన్ని హంగులతో నిర్మాణాన్ని చేపడుతోంది టీఆర్ఎస్. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయమూ ఇదే. ఈ లక్ష్యంతోనే ఢిల్లీలో గురువారం తెలంగాణ భవన్‌ నిర్మాణాన్ని తలపెట్టారు. ఇప్పుడిక ఇతర ప్రాంతాల్లో మన వసతులు నిర్మించుకోవడమూ అవసరమే. ఈ క్రమంలోనే కేసీఆర్‌ ఢిల్లీలో తెలంగాణ భవన్‌ నిర్మాణం చేపట్టారు.

దక్షిణ భారతదేశంలో ఏ ప్రాంతీయపార్టీకి లేనివిధంగా టీఆర్‌ఎస్‌కు సొంత భవనం ఏర్పాటుకానున్నది. సరిగ్గా ఒంటిగంటా 48 నిమిషాలకు భూమిపూజ చేయనున్నారు CM కేసీఆర్. ఢిల్లీలోని వసంత్‌ విహార్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో టీఆర్‌ఎస్‌ కార్యాలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో 1,100 చదరపు మీటర్ల ప్రాంగణంలో నిర్మించనున్న తెలంగాణభవన్‌కు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూమిపూజ చేయనున్నారు. రూ. 40 కోట్లతో అంచనా వ్యయంతో TRS భవన్‌ను నిర్మిస్తున్నారు. మీటింగ్‌ హాల్‌తో పాటు రాష్ట్రం నుంచి వివిధ పనుల మీద వచ్చే వారు స్టే చేసేందుకు అన్ని ఫెసిలిటీస్‌ ఉండేలా డిజైన్ చేశారు. TRS భవన్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ను పోలి ఉంటుందని అంటున్నాయి పార్టీ శ్రేణులు. వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలోనే శంకుస్థాపన కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్‌ వేవ్, లాక్‌డౌన్‌ వల్ల కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది.

ఏడాదిలోపే నిర్మాణాన్ని పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా గ్రాండ్‌గా జరపాలని ప్లాన్ చేశారు. హస్తినలో పార్టీ కార్యాలయానికి భూమిపూజ కార్యక్రమాన్ని ఇంటి పండుగలా చేసుకొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం కుటుంబసమేతంగా ఢిల్లీ చేరుకున్నారు. అలాగే, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులతోపాటు, ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థి నాయకులు ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణభవన్‌ భూమి పూజ సందర్భంగా ఢిల్లీ పురవీధులన్నీ గులాబీయం అయ్యాయి. ఢిల్లీకి చేరుకున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులకు లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు ఆతిథ్యం ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏ ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో ఆఫీసు లేదు. అలాంటిది టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా ఆఫీసును నిర్మించుకోవడంపై నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

Read Also… Income tax: ఆదాయపు పన్ను నోటీసులు రాకుండా ఎన్ని పొదుపు ఖాతాలను రన్ చేయొచ్చు?.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Click on your DTH Provider to Add TV9 Telugu