Andhra Pradesh: వారికి తెలియకుండానే అకౌంట్ల నుంచి మాయం అయిన నిధులు.. అసలేం జరుగుతోంది..

Andhra Pradesh: గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో నిధులు మంజూరు చేస్తుంటాయి. వాటిలో ఆర్థిక సంఘాల సిఫార్సుల మేరకు కేంద్రం..

Andhra Pradesh: వారికి తెలియకుండానే అకౌంట్ల నుంచి మాయం అయిన నిధులు.. అసలేం జరుగుతోంది..
Money
Follow us

|

Updated on: Sep 02, 2021 | 7:00 AM

Andhra Pradesh: గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో నిధులు మంజూరు చేస్తుంటాయి. వాటిలో ఆర్థిక సంఘాల సిఫార్సుల మేరకు కేంద్రం నుంచి వచ్చే నిధులే ఎక్కువ. ఈ క్రమంలోనే 14 ఆర్థిక సంఘం సిఫారుల మేరకు ఆయా పంచాయతీలకు నిధులు మంజూరయ్యాయి. అయితే, మంజూరైన నిధులను సరిగ్గా వినియోగించుకునే పాలక మండల్లు లేక పోవడంతో కోట్లాది రూపాయల నిధులు ఖాతాల్లోనే ఏళ్ల తరబడి నుంచి మురిగి పోయాయి. అయితే, ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలు జరిగినా సర్పంచ్ లకు తగిన అధికారాలు సకాలంలో అందకపోవడంతో ఆ నిధులు ఎక్కడ వెనక్కి వెళ్లిపోతాయో అన్న భయం అందరిలో నెలకొంది. ఇలాంటి తరుణంలో ఆయా ఖాతాల్లోని నిధులు పాలక మండలికి, కనీసం సర్పంచ్ లకు కూడా తెలియకుండా మాయం అయిపోయాయి. మరి ఇలా మాయం అవడానికి కారణం ఏంటి? అసలేం జరిగింది? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

అందరూ వెజ్ ప్రియులే.. కానీ ఇంట్లో దాచిన నాన్‌వెజ్ మాత్రం కనిపించకుండా పోయింది. ఇది ఎవరి పని అయి వుంటుందని అంతా ఆరా తీసే విధంగా వుంది శ్రీకాకుళం అధికారుల నిర్వాకం. జిల్లాలోని వందలాది పంచాయతీల్లోని ఖాతాల్లో వున్న 14 వ ఆర్థిక సంఘం నిధులు మాయం అయ్యాయి. పంచాయతీ ఖాతాలోని నిధులను ఆయా పంచాయతీల పాలక మండలి సభ్యులు తీర్మానం చేసిన తర్వాత ఆ డబ్బులతో పంచాయతీలో అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తారు. ఈ నిబంధన గ్రామ స్వరాజ్యం నిబంధనల్లో పొందు పరచి వుంది. ఆ నిబంధనల ప్రకారం.. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధి కోసం కేటాయించే నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎప్పుడు ఖర్చు చేసినా పర్వాలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధి కోసం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులు మాత్రం సమయానికి ఖర్చు చేయాలి. లేదంటే ఆ నిధులు వెనక్కి మళ్లిపోవడం తధ్యం. అలా ఏపీలో 14 సంఘం ఆర్థిక సంఘం నిధులు మురిగి పోవడానికి పంచాయతీ ఎన్నికల గడువు ముగిసినా సకాలంలో ఎన్నికలు జరగక పోవడం ఒక కారణమైతే.. ఎన్నికలు జరిగినా సకాలంలో సర్పంచ్ లకు అధికారాలు (చెక్ పవర్) ఇవ్వక పోవడంతో రెండో కారణం. అయితే కేంద్రానికి సంబంధించిన కోట్లాది రూపాయల పై ఎవరి కన్ను పడిందో ఏమో తెలియదు కానీ జిల్లాలో 1069 పంచాయతీల్లోని సుమారు ఏడు వందల పంచాయతీల ఖాతాల్లోని సుమారు వంద కోట్ల మేర 14 ఆర్థిక సంఘం నిధులు ఖాతాల నుంచి మాయం కావడంతో పంచాయతీ సర్పంచ్‌లు లబో దిబో మంటున్నారు. అసులు తమ అనుమతి లేకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా కోట్లాది రూపాయలు మాయం కావడంపై సంబంధిత అధికారులను ఆరా తీస్తున్నారు. అధికారులు సైతం తమకేమీ తెలియదని సమాధానం ఇవ్వడంతో వారు తమ ఖాతాల్లోని నిధులు ఎవరు కాజేసారో తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నారు. మరి ఆ నిధుల లెక్క తేలాలంటే వేచి చూడాల్సిందే.

Also read:

Andhra Pradesh: పిలవని పేరంటానికి వస్తారు.. వేలకు వేలు డిమాండ్ చేస్తారు.. ఇస్తే ఓకే.. లేదంటే సీన్ మామూలుగా ఉండదు..

Anantapur: రెచ్చిపోయిన అనంతపురం హోటల్ ఎస్ఆర్ గ్రాండ్‌ హోటల్ సిబ్బంది.. ఫోటోగ్రాఫర్ మీద దాడి : వాచ్ వీడియో

TRS Bhavan: టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో విజయం.. దేశరాజధానిలో TRS భవనం.. ఇవాళ సీఎం కేసీఆర్ భూమిపూజ