AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఉన్నోడిలా నటించాడు.. ఉన్నకాడికి దోచేశాడు.. సీన్‌కట్‌చేస్తే..

ధనవంతుడిగా నటిస్తూ మాట్రిమోని యాప్‌లో అమ్మాయిలకు వలవేసి.. వారి పెద్ద ఎత్తున డబ్బులు కాజేస్తున్న ఓ కేటాగాడికి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేటకు చెక్‌ పెట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేసన్‌లో దాదాపు 20 కి పైగా మోసాల కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Hyderabad: ఉన్నోడిలా నటించాడు.. ఉన్నకాడికి దోచేశాడు.. సీన్‌కట్‌చేస్తే..
Online Scam Arrest
Anand T
|

Updated on: May 20, 2026 | 12:55 PM

Share

తన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని.. మ్యాట్రిమోనీలో నకిలీ ప్రోఫైల్స్‌ చేసి మహిళ నుంచి డబ్బులు కాజేస్తున్న ఓ కేటుడానికి సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 20కిపైగా కేసులు ఉన్నట్టు గుర్తించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం. నిందితుడు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన మందా వెంకట కామేషుగా గుర్తించారు. ఇతను తెలుగు , రెడ్డి, బ్రాహ్మణ, కమ్మ వంటి ప్రముఖ మ్యాట్రిమోనీ సైట్‌లలో నకిలీ ప్రొఫైల్‌లను క్రియేట్ చేసుకొని.. తాను దనవంతుడినని అమ్మాయిలకు వలవేసినట్టు పోలీసులు గుర్తించారు.

పెళ్లి సంబంధాల కోసం చూసే మహిళలను టార్గెట్ చేస్తూ.. వాట్సాప్ కాల్స్, ఇన్‌స్టాగ్రామ్ చాట్‌ల ద్వారా వారితో సన్నిహితంగా మాట్లాడేవాడు. వాళ్లు పూర్తిగా అతన్ని నమ్మిన తర్వాత ఏదో ఒక సాకు తనకు డబ్బులు కావాలని అడిగేవాడు. అప్పటికే అతన్ని గుడ్డిగా నమ్మిన బాధితులు అతనికి డబ్బులు సమర్పించుకునేవారు. అదేకాదు బాధితుల నుంచి ఇతను క్రెడిట్ కార్డ్ వివరాలు, ఓటీపీ, బ్యాంక్ వివరాలను కూడా తీసుకొని వారి ఖాతాలను ఖాళీ చేసినట్టు పోలీసులు గుర్తించారు.ఇలా బాధితుల నుంచి కొట్టేసిన డబ్బును మొత్తం గోవాలోని ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, క్యాసినోలపై జూదమాడేందుకు విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ఘటన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ప్రజలకు, ముఖ్యంగా పెళ్లి సంబంధాలు వెతుకుతున్న మహిళలకు కీలక సూచనలు చేశారు. మ్యాట్రిమోనియల్ లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కలిసే ఎవరితోనైనా ముందుకు వెళ్లే ముందు వారి గుర్తింపు, నేపథ్యాన్ని పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. తెలియని వ్యక్తులకు లేదా కొత్తగా పరిచయమైన వారికి ఓటీపీలు , బ్యాంకు ఖాతా వివరాలు లేదా చెప్పవద్దని తెలిపారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే, వెంటనే సమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో గానీ లేదా జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ 1930 లో గానీ ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us