Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊరి శివారు వ్యవసాయ బావిలో నుంచి దుర్వాసన.. గోనే సంచిలో తెరిచి చూస్తే షాక్!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వృద్ధురాలి హత్య సంచలనం సృష్టించింది.. అతి కిరాతకంగా ఆమెను చంపిన గుర్తు తెలియని దుండగులు గోనెసంచిలో కట్టి వృద్ధురాలి మృతదేహాన్ని ఊరి చివర వ్యవసాయ బావిలో పడేశారు. దొంగలు బంగారం కోసం ఈ దారుణానికి ఒడి గట్టరా..? లేక ఏదైనా ఆస్తి వివాదం లేదా ఇంకేమైనా కుట్రకోణం ఉందా..? అనే అనుమానాలతో పోలీసుల దర్యాప్తు చేపట్టారు.

ఊరి శివారు వ్యవసాయ బావిలో నుంచి దుర్వాసన.. గోనే సంచిలో తెరిచి చూస్తే షాక్!
Crime News
Follow us
G Peddeesh Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Feb 25, 2025 | 3:50 PM

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వృద్ధురాలి దారుణ హత్య సంచలనం సృష్టించింది. అత్యంత పాశవికంగా ఆమెను హతమార్చిన గుర్తు తెలియని దుండగులు.. గోనెసంచిలో కట్టి వ్యవసాయ బావిలో పడేశారు. వృద్ధురాలి మృతదేహాన్ని ఊరి చివర వ్యవసాయ బావిలో ఐదు రోజుల తర్వాత గుర్తించారు. వృద్ధురాలి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటన టేకుమట్ల మండలం గర్మిల్లపల్లి గ్రామ శివారులో జరిగింది. బోయినపల్లి గ్రామానికి చెందిన సూరపాక వీరమ్మ అనే మహిళను గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఫిబ్రవరి19వ తేదీన గర్మిళ్లపల్లి గ్రామానికి వెళ్లిన వీరమ్మ తిరిగి రాలేదు. అతర్వాత అదృశ్యం అయిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

అయితే, ఆమె ఒంటిపై బంగారు నగలు ఉన్నాయి. ఆమె ఏమైపోయిందో తెలియక కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళన చెందుతున్న క్రమంలోనే సోమవారం సాయంత్రం గర్మిళ్లపల్లె శివారులోని వ్యవసాయ బావిలో వీరమ్మ మృతదేహం లభ్యమయింది. అత్యంత దారుణంగా వీరమ్మని చంపి గోనెసంచిలో మూటకట్టి ఆ వ్యవసాయ బావిలో పడేశారు గుర్తు తెలియని దుండగులు. ఐదు రోజుల తర్వాత బావి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి దర్యాప్తు చేపట్టారు. అయితే వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారం కోసమే ఈ హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

దొంగలు బంగారం కోసం ఈ దారుణానికి ఒడి గట్టరా..? లేక ఏదైనా ఆస్తి వివాదం లేదా ఇంకేమైనా కుట్రకోణం ఉందా..? అనే అనుమానాలతో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. టెక్నాలజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

మార్చి29 ఆకాశంలో అద్భుతం సూర్యగ్రహణం ఎప్పుడు ఎక్కడ వీక్షించవచ్చంట
మార్చి29 ఆకాశంలో అద్భుతం సూర్యగ్రహణం ఎప్పుడు ఎక్కడ వీక్షించవచ్చంట
అయ్యో ఎంతఘోరం! సమ్మక్క సారక్క జాతరకెళ్లి మిస్సై.. చివరకు
అయ్యో ఎంతఘోరం! సమ్మక్క సారక్క జాతరకెళ్లి మిస్సై.. చివరకు
ఎయిర్ పోర్ట్‌లో అరుస్తూ.. కేకేలు వేస్తూ కనిపించిన హీరోయిన్
ఎయిర్ పోర్ట్‌లో అరుస్తూ.. కేకేలు వేస్తూ కనిపించిన హీరోయిన్
ఎంపురాన్ రిలీజ్ సెలవు ప్రకటించిన కాలేజీ.. స్టూడెంట్స్‌కి టికెట్స్
ఎంపురాన్ రిలీజ్ సెలవు ప్రకటించిన కాలేజీ.. స్టూడెంట్స్‌కి టికెట్స్
SLBC టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు.. ఆరుగురి జాడ కోసం
SLBC టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు.. ఆరుగురి జాడ కోసం
ఇంటర్‌ పరీక్షలు రద్దు.. సర్కార్ కీలక నిర్ణయం!
ఇంటర్‌ పరీక్షలు రద్దు.. సర్కార్ కీలక నిర్ణయం!
ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని ఉపయోగిస్తున్నారా.. సమస్యలు తప్పవు..
ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని ఉపయోగిస్తున్నారా.. సమస్యలు తప్పవు..
అప్పటివరకూ సినిమాలు చేస్తూనే ఉంటా..
అప్పటివరకూ సినిమాలు చేస్తూనే ఉంటా..
ఏడాదికి ఒక్కసారి మాత్రమే తలుపులు తెరచుకునే ఆలయాలు.. ఎక్కడంటే..
ఏడాదికి ఒక్కసారి మాత్రమే తలుపులు తెరచుకునే ఆలయాలు.. ఎక్కడంటే..
పెట్టుబడులే లక్ష్యంగా.. జపాన్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌..
పెట్టుబడులే లక్ష్యంగా.. జపాన్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌..
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!