AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అమ్మ పొత్తిళ్లలో నిద్రిస్తున్న 8 నెలల పసిబాలుడు మాయం.. తీరా చూస్తే..!

ఫిబ్రవరి 23వ తేదీన రాత్రి తల్లి గీత, శివం అనే 8 నెలల బాలుడుతో కలిసి నిద్రపోయింది. తెల్లారి లేచి చూసేసరికి పక్కనే ఉన్న బాలుడు కనిపించకుండాపోయాడు. దీంతో పరిసర ప్రాంతాల్లో బాలుడి కోసం వెతికారు ఆ దంపతులు. దీంతో చివరికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది గీత.

Hyderabad: అమ్మ పొత్తిళ్లలో నిద్రిస్తున్న 8 నెలల పసిబాలుడు మాయం.. తీరా చూస్తే..!
Balanagar Boy Kidnap Case
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Feb 25, 2025 | 9:12 PM

Share

పుట్‌పాత్‌పై తల్లి ప్రక్కన రాత్రి సమయంలో నిద్రిస్తున్న పసిబాలుడిని దుండగులు ఎత్తుకెళ్లారు. ఉదయం చుట్టుప్రక్కల ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. చివరికి ఆ తల్లి రోదిస్తూ సనత్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు రోజుల వ్యవధిలోనే కేసును చేధించారు. ఆ 8 నెలల బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు హైదరాబాద్ పోలీసులు.

బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్ శివాలయం రోడ్డులో కలివల గీత రాధేయ భార్యాభర్తలు స్క్రాప్ దందా చేసుకుంటున్నారు. రోడ్ల వెంబడి చెత్తను సేకరించి అమ్ముకుని తమ ఇద్దరు పిల్లలతో జీవిస్తున్నారు. ఫిబ్రవరి 23వ తేదీన రాత్రి తల్లి గీత, శివం అనే 8 నెలల బాలుడుతో కలిసి నిద్రపోయింది. తెల్లారి లేచి చూసేసరికి పక్కనే ఉన్న బాలుడు కనిపించకుండాపోయాడు. దీంతో పరిసర ప్రాంతాల్లో బాలుడి కోసం వెతికారు ఆ దంపతులు. దీంతో చివరికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది గీత. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డీసీపీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

చివరికి సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు పోలీసులు. తల్లి దగ్గర నిద్రిస్తున్న బాలుడిని పక్కా ఫ్లాన్ ప్రకారమే ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. నిందితులు బాలుడి కిడ్నాప్ చేసేందుకు ముందే పాల డబ్బా కొన్నట్లుగా గుర్తించారు. ఆ కోణంలో దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను బీహార్ రాష్ట్రానికి చెందిన సత్యనారాయణ, శోభాదేవి దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.

సత్యనారాయణ తన సహచరుడు సన్నీకుమార్ పాండేతో కలసి ప్లాన్ ప్రకారం పేద కుటుంబానికి చెందిన బాలుడిని కిడ్నాప్ చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని భావించారు. దీంతో రోడ్డు వెంబడి నిద్రిస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. కిడ్నాపర్స్ నుండి బాలుడిని క్షేమంగా రక్షించిన పోలీసులు, తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులు సత్యనారాయణ, సన్నీకుమార్ పాండేను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించిన్నట్లు బాలానగర్ డిసిపి వెల్లడించారు. కేసును చేధించిన సనత్ నగర్ పోలీసులను డిసిపి అభినందించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
రైతన్నలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు!
రైతన్నలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు!
అతి మంచితనం మీ జీవితాన్నే దెబ్బతీయొచ్చు.. చాణక్య నీతి హెచ్చరిక!
అతి మంచితనం మీ జీవితాన్నే దెబ్బతీయొచ్చు.. చాణక్య నీతి హెచ్చరిక!
మర్రి ఆకులను పూజలో వాడుతున్నారా? ఈ దేవతలకు సమర్పిస్తే శుభం..
మర్రి ఆకులను పూజలో వాడుతున్నారా? ఈ దేవతలకు సమర్పిస్తే శుభం..
కరోనా సృష్టించిన వుహాన్ ల్యాబ్‌కు అమెరికా నిధులా?
కరోనా సృష్టించిన వుహాన్ ల్యాబ్‌కు అమెరికా నిధులా?
పాము గుడ్లను తింటే మనిషి చనిపోతాడా..? 99శాతం మందికి తెలియని..
పాము గుడ్లను తింటే మనిషి చనిపోతాడా..? 99శాతం మందికి తెలియని..
ఐపీఎల్‌లోకి సిక్సర్ కింగ్ రీఎంట్రీ.. వచ్చే ఏడాది సరికొత్తగా..
ఐపీఎల్‌లోకి సిక్సర్ కింగ్ రీఎంట్రీ.. వచ్చే ఏడాది సరికొత్తగా..
అర్ధరాత్రి వదిన లేదని తెలిసి ఇంట్లోకి చొరబడ్డ మరదలు!
అర్ధరాత్రి వదిన లేదని తెలిసి ఇంట్లోకి చొరబడ్డ మరదలు!
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో దూరిన ఆవు,ప్లేయర్లు పరుగో పరుగు!వీడియో చూస్తే
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో దూరిన ఆవు,ప్లేయర్లు పరుగో పరుగు!వీడియో చూస్తే
సాలగ్రామాన్ని ఇంట్లో ఉంచుకోవడం మంచిదేనా? అపోహలు, వాస్తవాలు..
సాలగ్రామాన్ని ఇంట్లో ఉంచుకోవడం మంచిదేనా? అపోహలు, వాస్తవాలు..
ట్రాఫిక్ చలాన్ వేసిన పోలీసుకే చుక్కలు చూపిన యువకుడు!
ట్రాఫిక్ చలాన్ వేసిన పోలీసుకే చుక్కలు చూపిన యువకుడు!