వీటిని తింటే డయాబెటిస్‌ వస్తుందా?

19 June 2026

TV9 Telugu

TV9 Telugu

పొటాషియం, పీచు, విటమిన్లకు మంచి వనరుగా ప్రశంసిస్తే, మరికొందరు అధిక పిండి పదార్థాలు, గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కారణంగా ఆరోగ్యానికి హానికరమని భావిస్తారు

TV9 Telugu

అయితే తాజాగా వెలువడిన ఒక దీర్ఘకాలిక అధ్యయనం ఆలుగ‌డ్డల కంటే వాటిని వండే విధానమే ఆరోగ్య ప్రమాదాలకు ప్రధాన కారణమని వెల్లడించింది

TV9 Telugu

ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ను తరచూ తినేవారిలో టైప్‌ 2 మధుమేహం వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అదే సమయంలో ఉడికించిన, కాల్చినవి తింటే మధుమేహ పెరగదు

TV9 Telugu

వారానికి మూడు సార్లు ఆలుగ‌డ్డల స్థానంలో సంపూర్ణ ధాన్యాలను తీసుకుంటే టైప్‌-2 మధుమేహం వచ్చే ప్రమాదం 8 శాతం తగ్గినట్లు తాజా అధ్యయనంలో గుర్తించారు

TV9 Telugu

అదే ఫ్రెంచ్‌ ఫ్రైస్‌కు బదులుగా సంపూర్ణ ధాన్యాలను తీసుకుంటే ఈ ప్రమాదం 19 శాతం వరకు తగ్గింది. అయితే ఆలూకు బదులు బియ్యాన్ని ఎక్కువగా తింటే మధుమేహ పెరుగుతుంది

TV9 Telugu

దీంతో ఆహారంలో ఏ పదార్థాన్ని తొలగిస్తున్నామన్నదే కాకుండా, దాని స్థానంలో ఏది తీసుకుంటున్నామనేది కూడా ముఖ్యమని స్పష్టమవుతోంది

TV9 Telugu

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, పొటాటో చిప్స్‌, డీప్‌ ఫ్రై చేసిన ఆలుగ‌డ్డల పదార్థాలను క్రమంగా తగ్గించడం మంచిది

TV9 Telugu

ఇంట్లో ఆలుగ‌డ్డలను వండేటప్పుడు తొక్కతోనే ఉడికించడం లేదా కాల్చడం ద్వారా పీచు పదార్థాన్ని ఎక్కువగా పొందవచ్చు