AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తింటే ప్రాణాలకే ముప్పు..! చార్మినార్ ఫాస్ట్ ఫుడ్ గోదాములో బయటపడ్డ షాకింగ్ బండారం!

హైదరాబాద్ మహానగరంలో గత రెండు రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు, హైదరాబాద్ సిటీ పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక తనిఖీలు కల్తీ ఆహార వ్యాపారుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న నాణ్యతలేని, అపరిశుభ్ర ఆహార తయారీ కేంద్రాలపై అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

తింటే ప్రాణాలకే ముప్పు..! చార్మినార్ ఫాస్ట్ ఫుడ్ గోదాములో బయటపడ్డ షాకింగ్ బండారం!
Charminar Food Godown
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jun 19, 2026 | 1:24 PM

Share

హైదరాబాద్ మహానగరంలో గత రెండు రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు, హైదరాబాద్ సిటీ పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక తనిఖీలు కల్తీ ఆహార వ్యాపారుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న నాణ్యతలేని, అపరిశుభ్ర ఆహార తయారీ కేంద్రాలపై అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

తాజాగా చార్మినార్ పరిధిలోని హుస్సేనీఆలం ప్రాంతంలో ఉన్న ‘అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్’ గోదాముపై హెచ్-ఫాస్ట్ (Hyderabad Food Safety Task Force) బృందం ఆకస్మికంగా దాడులు చేపట్టింది. తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్స్ లేకుండానే గోదామును నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆహార పదార్థాల తయారీలో నిషేధిత కృత్రిమ రంగులను వినియోగిస్తున్నట్లు బయటపడింది. అలాగే ఒకసారి ఉపయోగించిన వంట నూనెను పదేపదే వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నట్లు తేలింది.

అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల వంట నూనెతో పాటు కృత్రిమ రంగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని ఫుడ్ సేఫ్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇటీవలి రెండు రోజులుగా నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార గోదాములపై నిర్వహించిన తనిఖీల్లో నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనలు బయటపడిన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, ఆహార కల్తీపై జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తామని హైదరాబాద్ సిటీ పోలీసులు స్పష్టం చేశారు. అనుమానాస్పద ఆహార పదార్థాలు, కల్తీ ఆహారంపై ఫిర్యాదులు ఉన్నవారు 8712661212 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు సూచించారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!