AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా అసలు గుట్టు..! వుహాన్ ల్యాబ్‌కు అమెరికా నిధులా? తులసి గబ్బార్డ్ సంచలన వ్యాఖ్యలు!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మూలాలపై మరోసారి చర్చ మొదలైంది. అమెరికా జాతీయ నిఘా సంస్థ మాజీ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కరోనా వైరస్ ఉద్భవానికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదానికి కొత్త కోణాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

కరోనా అసలు గుట్టు..! వుహాన్ ల్యాబ్‌కు అమెరికా నిధులా? తులసి గబ్బార్డ్ సంచలన వ్యాఖ్యలు!
Tulsi Gabbard Releases Files Implicating Dr Fauci
Balaraju Goud
|

Updated on: Jun 19, 2026 | 4:04 PM

Share

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మూలాలపై మరోసారి చర్చ మొదలైంది. అమెరికా జాతీయ నిఘా సంస్థ మాజీ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కరోనా వైరస్ ఉద్భవానికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదానికి కొత్త కోణాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

తాజాగా వర్గీకరణ నుంచి తొలగించిన పలు నిఘా పత్రాలను ప్రస్తావిస్తూ, అమెరికా ప్రభుత్వ నిధులతో విదేశాల్లో అనేక బయోల్యాబ్‌లు పనిచేశాయని గబ్బార్డ్ వెల్లడించారు. ఈ సందర్భంగా అమెరికా జాతీయ అలెర్జీ, అంటు వ్యాధుల సంస్థ (NIAID) మాజీ డైరెక్టర్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీ పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. కరోనా మహమ్మారి ప్రారంభ దశలో వైరస్ మూలాలపై జరిగిన చర్చల్లో ఫౌచీ ప్రభావం చూపారని, అనంతరం కాంగ్రెస్ ముందు కొన్ని సంబంధాలను ఖండించారని ఆమె ఆరోపించారు.

ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (ODNI) విడుదల చేసిన పత్రాల ప్రకారం, అమెరికా గతంలో 30కిపైగా దేశాల్లో 120కు పైగా బయోల్యాబ్‌లకు నిధులు సమకూర్చినట్లు పేర్కొంది. ఈ ల్యాబ్‌లలో కొన్ని ప్రమాదకర వైరస్‌లు, వ్యాధికారక సూక్ష్మజీవులపై పరిశోధనలు నిర్వహించాయని కూడా వెల్లడించింది

అయితే కరోనా వైరస్ నేరుగా చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి లీకైందని ఈ పత్రాలు నిర్ధారించలేదని నిపుణులు చెబుతున్నారు. కరోనా మూలాలపై అమెరికా నిఘా సంస్థలు గతంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. కొందరు అధికారులు ల్యాబ్ లీక్ సిద్ధాంతానికి మద్దతు ఇవ్వగా, మరికొందరు వైరస్ సహజసిద్ధంగా ఉద్భవించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. “లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ మహమ్మారి గురించి ప్రజలకు పూర్తి నిజాలు తెలుసుకునే హక్కు ఉంది. పారదర్శకత, జవాబుదారీతనం అవసరం” అని తులసి గబ్బార్డ్ పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలతో కరోనా మూలాలపై ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చ వేడెక్కింది.

వీడియో ఇక్కడ చూడండి…

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us