AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘వంద దేవుళ్లు’ సినిమా రివ్యూ.. ‘బిచ్చగాడు’ కాంబినేషన్ మరో హిట్ కొట్టిందా..?

Vanda Devullu Movie Review: 'బిచ్చగాడు' తర్వాత విజయ్ ఆంటోనీ–శశి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'వంద దేవుళ్లు' సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. విజయ్ ఆంటోనీ నిర్మాతగా వ్యవహరిస్తూ తన మేనల్లుడు అజయ్ ధిషన్‌ను హీరోగా ఈ చిత్రం ద్వారా పరిచయం చేశారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో, కథ–కథనం, నటీనటుల నటన, సాంకేతిక విభాగాల పనితీరు ఎలా ఉన్నాయో ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.

‘వంద దేవుళ్లు’ సినిమా రివ్యూ.. ‘బిచ్చగాడు’ కాంబినేషన్ మరో హిట్ కొట్టిందా..?
Vanda Devullu Movie Review
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jun 19, 2026 | 3:42 PM

Share

Vanda Devullu Review: బిచ్చగాడు లాంటి సంచలన విజయం తర్వాత విజయ్ ఆంటోనీ, శశి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా వంద దేవుళ్లు. ఈ సినిమాపై ముందు నుంచి ఆసక్తి బాగానే ఉంది. తనే నిర్మాతగా ఉంటూ మేనల్లుడిని హీరోగా పరిచయం చేసారు విజయ్. మరి ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: వంద దేవుళ్లు

నటీనటులు : విజయ్ ఆంటోనీ, స్వాసిక విజయ్, అజయ్ ధిషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్ తదితరులు

ఇవి కూడా చదవండి

సంగీతం: బాలాజీ శ్రీరామ్

సినిమాటోగ్రఫీ: విజి సతీష్

ఎడిటింగ్: హరీష్ యువరాజ్

దర్శకత్వం: శశి

నిర్మాణం: మీరా విజయ్ ఆంటోనీ

కథ:

వాసవి (స్వాసిక)కి 26 ఏళ్లు ఉన్నపుడే భర్త చనిపోతాడు. తన ఇద్దరు కొడుకులను ఒంటరిగా పెంచే బాధ్యత తీసుకుంటుంది. ఒంటరి కావడంతో ఊళ్లో ఉన్న ప్రతీ ఒక్కరు వాసవి దగ్గర తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటారు.. అవకాశం తీసుకోవాలని చూస్తుంటారు. పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాసవి.. ఓ సమయంలో జీవితంలో తను కూడా మళ్లీ ఇంకో దశ మొదలుపెట్టాలని.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అదే విషయం పిల్లలకు చెబుతుంది. వాసవి పెద్ద కొడుకు భాస్కర్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. సమాజం ఏమనుకుంటుందో అని అమ్మను అసహ్యించుకుంటాడు. అయితే కొన్ని రోజుల తర్వాత అమ్మ బాధ భాస్కర్‌కు అర్థం అవుతుంది.. అప్పట్నుంచి ఆమెను మళ్లీ పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తాడు. కానీ వాసవికి ఆ ఆసక్తి తగ్గిపోతుంది. అలాంటి సమయంలో వాసవి జీవితంలోకి ఏడుకొండలు (విజయ్ ఆంటోనీ) వస్తాడు. అప్పుడేమైంది అనేది అసలు కథ..

కథనం:

దాదాపు 30 ఏళ్ళ కింద తెలుగులో మా నాన్నకు పెళ్లి అనే సినిమా వచ్చింది.. అందులో శ్రీకాంత్ తన తండ్రి కృష్ణంరాజుకు మరో పెళ్లి చేయాలని చూస్తుంటాడు. ఇప్పుడు విజయ్ ఆంటోనీ మా అమ్మకు పెళ్లి అనే సినిమా నిర్మించారు.. అందులో ఈవీవీ ఎంటర్‌టైన్మెంట్ టచ్ చేస్తే.. ఇక్కడ ఎమోషన్ టచ్ చేసారు. కొన్నిసార్లు కొన్ని సినిమాలు తెలియకుండానే సర్‌ప్రైజ్ చేస్తుంటాయి. వంద దేవుళ్లు అలాంటి సినిమానే.. ఇది తీసిపారేసే సినిమా కాదు అలాగని కమర్షియల్ సబ్జెక్ట్ కూడా కాదు. అమ్మకు పెళ్లి చేసే ఇద్దరు కొడుకుల కథ ఇది.. వినడానికి లైన్ కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది.. కాకపోతే తమిళ వాసనలు ఎక్కువయ్యాయి. సెకండాఫ్‌లో విజయ్ ఆంటోనీ వచ్చిన తర్వాత సినిమా బాగుంటుంది. కనిపించేది కాసేపే అయినా విజయ్ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ శ్వాసిక నటన.. ఆమె ఒక్కరే మొత్తం నడిపించారు. పాతికేళ్లకే భర్తను పోగొట్టుకుని ఇద్దరు పిల్లల్ని పెంచే పాత్రలో అద్భుతంగా నటించారు. మళ్లీ పెళ్లి అనే ఆలోచన రిస్క్.. కానీ దాన్ని కన్విన్సింగ్‌గానే చెప్పే ప్రయత్నం చేసారు శశి.. బిచ్చగాడు తరహాలో ఇందులో కూడా అమ్మ సెంటిమెంట్‌నే తీసుకున్నారాయాన.. ఇద్దరు అబ్బాయిల నటన బాగుంది.. విజయ్ ఆంటోనీ పాత్ర బాగుంటుంది. దర్శకుడు శశి కాస్త టైమ్ తీసుకున్నా.. మంచి కథతోనే వచ్చాడు. ఇలాంటి ఎమోషనల్ సినిమాకు క్లైమాక్స్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ప్లాన్ చేసాడు దర్శకుడు. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా వెళ్లిన ఫీలింగ్ వచ్చినా.. ఇంటర్వెల్ నుంచి కథ ఊపందుకుంటుంది. ముఖ్యంగా కథలోకి విజయ్ ఆంటోనీ వచ్చాక అస్సలు ఆగలేదు. చివరగా బయటికి వచ్చేటప్పుడు మంచి సినిమాతోనే వచ్చామనే ఫీలింగ్ తెప్పించారు మేకర్స్.

నటీనటులు:

తల్లి పాత్రలో శ్వాసిక అద్భుతంగా నటించింది. తన వయసు కంటే చాలా పెద్ద పాత్ర చేసింది ఈమె.. అయినా కూడా ఎంతో పరిణతితో, ఎమోషనల్ డెప్త్‌తో ఆమె పాత్రను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఒక పల్లెటూరి వాసనతో వచ్చిన కథ కావడంతో సహజంగా, హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి ఈమె నటించిన సన్నివేశాలు. సెకండ్ హాఫ్‌లో ఎంట్రీ ఇచ్చే విజయ్ ఆంటోనీ సినిమాకు కొత్త ఎనర్జీని తెచ్చాడు. స్వాసిక, విజయ్ ఆంటోనీల మధ్య వచ్చే సీన్లు సినిమాకే హైలైట్. అలాగే పిల్లలు ఇద్దరితో అమ్మకు వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

స్వతహాగా విజయ్ ఆంటోనీ మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా ఈ సినిమాకు ఆయన బాధ్యత తీసుకోలేదు. బాలాజీ శ్రీరామ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. పాటలు కూడా ఓకే. దర్శన్ కిర్లోష్ కెమెరా వర్క్ బాగుంటుంది. పల్లెటూరి వాతావరణం బాగా చూపించారు. హరీష్ యువరాజ్ ఎడిటింగ్ కాస్త గ్రిప్పింగ్‌గా ఉండాల్సింది. ​దర్శకుడు శశి మరోసారి హ్యూమన్ ఎమోషన్స్ చుట్టూనే కథ రాసుకున్నాడు. బిచ్చగాడులో వచ్చిన కథ పేపర్‌లో వచ్చిందే.. ఈసారి కూడా నిజంగా జరిగిన కథను తీసుకుని కథగా రాసుకున్నాడు శశి. భాష్యశ్రీ రాసిన తెలుగు డైలాగ్స్ బాగున్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా వంద దేవుళ్లు.. మంచి ఎమోషనల్ సినిమా..!

Follow Us