AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amrutha Pranay: మిర్యాలగూడ విషాదాంత లవ్‌స్టోరీ అమృత ప్రణయ్ గుర్తుందా..? ఆరేళ్ల తర్వాత తల్లి వద్దకు..

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 14వ తేదీన జరిగిన ప్రణయ్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మిర్యాలగూడకు రియల్ వ్యాపారి మారుతీ రావు కూతురు అమృత, ఇదే పట్టణానికి చెందిన దళితుడు ప్రణయ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కులాంతర వివాహాన్ని అంగీకరించని మారుతీ రావు.. ప్రణయ్ ను హత్య చేయించాడని అమృత తండ్రిపై కేసు పెట్టింది. ఈ కేసు విచారణలో ఉండగానే అమృత తండ్రి మారుతీరావు హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మారుతీరావును కడసారి చూసేందుకు వచ్చిన అమృతను కుటుంబ సభ్యులు..

Amrutha Pranay: మిర్యాలగూడ విషాదాంత లవ్‌స్టోరీ అమృత ప్రణయ్ గుర్తుందా..? ఆరేళ్ల తర్వాత తల్లి వద్దకు..
Amrutha Pranay
M Revan Reddy
| Edited By: Srilakshmi C|

Updated on: Aug 17, 2023 | 2:56 PM

Share

హైదరాబాద్‌, ఆగస్టు 17: కక్షలు, కర్పన్యాలతో ఏర్పడిన ఎలాంటి గాయాన్నైనా కాలం మాన్పుతోందంటారు పెద్దలు. అందుకు నిదర్శనమమే ఈ ఘటన. తల్లి కూతుళ్ళ అనుబంధం వేరే.. తల్లిని కూతురు కలవడం సాధారణమే.. కానీ ఈమె తన తల్లిని కలిసిన వీడియో మాత్రం వైరల్ అవుతోంది. కక్షలు, కర్పన్యాలతో విచ్ఛిన్నమైన కుటుంబ బంధాలు, గాయాలను కాలం మాన్పుతోందంటారు పెద్దలు. ఈమె ఐదేళ్ల తర్వాత తల్లిని కలవడం సంచలనంగా మారింది. ఆమె ఎవరో తెలుసుకోవాలంటే…

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 14వ తేదీన జరిగిన ప్రణయ్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మిర్యాలగూడకు రియల్ వ్యాపారి మారుతీ రావు కూతురు అమృత, ఇదే పట్టణానికి చెందిన దళితుడు ప్రణయ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కులాంతర వివాహాన్ని అంగీకరించని మారుతీ రావు.. ప్రణయ్ ను హత్య చేయించాడని అమృత తండ్రిపై కేసు పెట్టింది. ఈ కేసు విచారణలో ఉండగానే అమృత తండ్రి మారుతీరావు హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మారుతీరావును కడసారి చూసేందుకు వచ్చిన అమృతను కుటుంబ సభ్యులు బంధువులు అడ్డుకున్నారు. దీంతో అమృత వెను దిరిగారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకునే ముందు లేటర్ రాశాడు. తల్లి గిరిజ వద్దకు వెళ్లమని అమృతను ఆ లేఖలో కోరాడు. అప్పట్లో పోలీసుల రక్షణతో మిర్యాలగూడ లో ఉన్న తల్లి గిరిజను పరామర్శించింది అమృత.

ఆ తర్వాత అమృతకు బాబు జన్మించాడు. అత్తవారితో కలిసి హైదరాబాదులో ఉంటున్న అమృత యూట్యూబ్‌ చానెల్‌ ను నిర్వహిస్తోంది. తన యూట్యూబ్ ఛానల్ కు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రణయ్‌ జ్ఞాపకాలు, తన బాబు మెమరబుల్‌ మూమెట్స్‌, వంటకాలు, హోం టూర్స్ ను షేర్‌ చేస్తోంది. తాజాగా తన తల్లితో కలిసి ఉన్న వీడియో యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. ఇందులో ఆరేళ్ల తర్వాత అమ్మను కలిశానని పేర్కొంది. ఆ వీడియోలో అమృత తల్లి కూడా సంతోషంగా కనిపించారు. అమృత కూడా చాలా హ్యాపీగా ఉండడంతో ఇక అంతా కలిసిపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకాలం కోపంతో.. దూరంగా ఉంటూ తల్లి గిరిజను కలవడంపై అమృతను నెటిజన్లు అభినందిస్తున్నారు. కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పుతుందనదానికి అమృత ప్రణయ్ ఘటన నిదర్శనమని నెటిజన్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.