Ambedkar Jayanti: హైదరాబాద్‌లో ఆకాశమంతా అంబేద్కర్ విగ్రహం.. ప్రత్యేకతలేంటో తెలుసా?..

|

Apr 13, 2023 | 9:47 PM

హుస్సెన్ సాగర్ సమీపంలోని స్థలంలో 11 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు.. అనేక విశేషాల సమాహారంగా రూపుదిద్దుకుంటోంది. భారీ విగ్రహం తోపాటు చుట్టూ ప్రత్యేకమైన పార్క్, ఉద్యానవనాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అంబేద్కర్ విగ్రహం కింది భాగంలో ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు.

Ambedkar Jayanti: హైదరాబాద్‌లో ఆకాశమంతా అంబేద్కర్ విగ్రహం.. ప్రత్యేకతలేంటో తెలుసా?..
B. R. Ambedkar Statue
Follow us on

హుస్సెన్ సాగర్ సమీపంలోని స్థలంలో 11 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు.. అనేక విశేషాల సమాహారంగా రూపుదిద్దుకుంటోంది. భారీ విగ్రహం తోపాటు చుట్టూ ప్రత్యేకమైన పార్క్, ఉద్యానవనాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అంబేద్కర్ విగ్రహం కింది భాగంలో ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. అందులో అంబేద్కర్ జీవిత చరిత్రతో పాటు రాజ్యాంగం సంబంధించిన పలు అంశాలను చేర్చుతారు.

బోధించు.. సమీకరించు.. పోరాడు.. అని నినదించారు డా.బీఆర్‌ అంబేద్కర్‌! సామాజిక ప్రజాస్వామ్య లక్ష్యం కోసం పోరాడారు. ప్రజల జీవితాల్లో స్వేచ్ఛ, సమానత్వం, సహోదరభావం, సమన్యాయం పాదుకొల్పడమే సామాజిక ప్రజాస్వామ్యామని పేర్కొన్నారు. అది లేకుంటే కేవలం రాజకీయ ప్రజాస్వామ్యంతో ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఆ సామాజిక విప్లవం పుట్టినరోజునే..125 అడుగుల మహావిగ్రహం ఆవిష్కృతం అవుతున్న వేళ..ఆ రాజ్యాంగ పితామహునికి టీవీ9 నీలినీలి వందనాలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..