AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎన్నికల ప్రచారంలో నయా ట్రెండ్.. వారికి లక్షల ప్యాకేజీలు ఇస్తున్న లీడర్స్

న్నికల ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్లే విధానాలను వారితో మరింత చర్చించి ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. ప్రచార అవసరానికి తమ ప్రధాన ఆయుధం సోషల్ మీడియా అని చాలామంది లీడర్స్ నమ్ముతున్నారు. అందరి వ్యూ ఒకటే అయినా తమదైన శైలిలో ప్రజల్లో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికలకు సోషల్ మీడియా టీంను రెడీ చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రతిభ ఉన్న, అనుభవజ్ఞులైన వారిని ఎంచుకునే పనిలో పడ్డారు.

Telangana: ఎన్నికల ప్రచారంలో నయా ట్రెండ్.. వారికి లక్షల ప్యాకేజీలు ఇస్తున్న లీడర్స్
Social Media
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Sep 10, 2023 | 7:39 PM

Share

ఎన్నికల ప్రచారంలో కొత్త పోకడ మొదలైంది. ప్రత్యర్థులను డామినేట్ చేసేందుకు సోషల్ మీడియాను ప్రచార అస్త్రంగా మలుచుకుంటున్నారు నాయకులు. నిత్యం ప్రజలతో మమేకం అయ్యేందుకు సోషల్ ఫ్లాట్ ఫామ్స్ వేదికగా కొత్త  ప్యాకేజీలకు తెరలేపారు. ఖర్చు తక్కువ, ప్రచారం ఎక్కువ కావడంతో సోషల్ మీడియాలో హల్చల్ చేసేందుకు నేతలు రెడీ అయ్యారు. ప్రతి ఒక్కరి చేతుల్లో ప్రజంట్ సెల్‌ఫోన్ కామన్ అయిపోయింది. లేచింది మొదలు పడుకునే వరకు ఫోన్ చూసే వారు లక్షల్లో ఉండడంతో ప్రచారానికి ఇది కరెక్ట్ వే అనుకుంటున్నారు నేతలు.  చేసిన పనిని.. చేయబోయే పనులను.. తమ ప్రచార కార్యక్రమాల్ని పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యచరణ సిద్దం చేసుకుంటున్నారు.  ఇందుకోసం సోషల్ మీడియా సెలబ్రిటీలను తమ ప్రచార క్యాంపెనర్లుగా వినియోగించుకుంటున్నారు.

ఎన్నికల ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్లే విధానాలను వారితో మరింత చర్చించి ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. ప్రచార అవసరానికి తమ ప్రధాన ఆయుధం సోషల్ మీడియా అని చాలామంది లీడర్స్ నమ్ముతున్నారు. అందరి వ్యూ ఒకటే అయినా తమదైన శైలిలో ప్రజల్లో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికలకు సోషల్ మీడియా టీంను రెడీ చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రతిభ ఉన్న, అనుభవజ్ఞులైన వారిని ఎంచుకునే పనిలో పడ్డారు. స్క్రిప్ట్ మొదలు ప్రచార శైలి భిన్నంగా ఉండాలనుకుంటున్నారు.  ఎన్నికల ప్రచారంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు తమ ప్రచార మార్కును రెడీ చేసుకుంటున్నారు. అందుకోసం సోషల్ మీడియాకు ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నారు. జనంలోకి వెళ్లేందుకు దగ్గరి మార్గం సులువైన మార్గం సోషల్ మీడియానే అన్నది ఇప్పుడు చాలామంది ఒపెనియన్. దీంతో పలువురు యూట్యూబ్ స్టార్లు, స్క్రిప్ట్ రైటర్లకు డిమాండ్ పెరిగింది. వారంతా ఇప్పుడు భారీ మొత్తంలో ప్యాకేజీ డిమాండ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది.

ముఖ్యంగా మిలియన్లలో రీచ్, లక్షల్లో సబ్‌స్క్రైబర్స్ ఉన్న సోషల్ మీడియా స్టార్లకు గాలం వేస్తున్నారు నేతలు.  మరి ఈ సోషల్ ప్రచారం లీడర్లకు ఎంతమేర సాయపడుతుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి.