Telangana: రెస్టారెంట్‌కి వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు.. ఆపై వేడి వేడిగా తింటుండగా..

ఈ మధ్యకాలంలో బిర్యానీలో బొద్దింకలు, జెర్రిలు, బల్లులు కనిపించడం కామన్ అయిపోయింది. కొన్ని రోజుల క్రితం టాబ్లెట్ కవర్ కూడా కనిపించింది. ఇలాంటి వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. అయినా రెస్టారెంట్, హోటల్ యాజమాన్యాలలో మార్పు కనిపించడం లేదు. తాజాగా మతాజాగా మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్ పోలీస్​స్టేషన్ పరిధిలో...

Telangana: రెస్టారెంట్‌కి వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు..  ఆపై వేడి వేడిగా తింటుండగా..
Blade Found In Biryani
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 22, 2024 | 9:12 PM

సాధారణంగా చికెన్​ బిర్యానీ మంచిగా ఘుమఘుమలాడాలంటే.. గసగసాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలు ఉండాలి.  అటుపైన కొత్తి మీర, పుదీనా కూడా కావాలి. ఇవన్నీ పడితేనే చికెన్ బిర్యానీకి అసలైన టేస్ట్ వస్తుంది. కానీ ఎంతో ఫేమస్ అయిన హైదరాబాద్ చికెన్ బిర్యానీలో చికెన్‌కు బదులు.. పురుగులు, బల్లులు, జెర్రిలు వంటివి దర్శనమివ్వడం కామన్ అయిపోయింది. ఇలాంటి ఘటనలు పదే పదే వెలుగుచూస్తున్నాయి. దీంతో బయట బిర్యానీ తినాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు.

యాదాద్రి భువనగరి జిల్లా బీబీ నగర్ మండలం మక్త అనంతారం గ్రామానికి చెందిన బింగి ఐలయ్య అతడి స్నేహితులతో కలిసి  మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్ పోలీస్​స్టేషన్ పరిధి ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్​లో బిర్యానీ తిందామని వెళ్లారు. అక్కడ ఫ్రెండ్స్‌ అంతా కలిసి చికెన్‌ బిర్యానీ ఆర్డర్ చేశారు. వేడి వేడి బిర్యానీ సర్వ్‌ చేశారు అక్కడి హెటల్ స్టాఫ్. అందరూ కలిసి బిర్యానీ తింటుండగా, ప్లేట్​లో బ్లేడ్ రావడంతో ఒక్కసారిగా షాకయ్యారు. ఇదేంటని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలియక వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితుడు ఘట్​కేసర్ పోలీస్​స్టేషన్​లో కంప్లైంట్ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో టీటీ చేయించుకున్న బాధితుడు మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

ఫ్రెండ్స్​తో కలిసి బిర్యానీ తినేందుకు వచ్చాడు - సగం తిన్నాక
ఫ్రెండ్స్​తో కలిసి బిర్యానీ తినేందుకు వచ్చాడు - సగం తిన్నాక
పగటి పూట కునుకు తీస్తున్నారా? మీ లివర్‌కి డేంజర్ బెల్స్ మోగినట్లే
పగటి పూట కునుకు తీస్తున్నారా? మీ లివర్‌కి డేంజర్ బెల్స్ మోగినట్లే
బాబోయ్.. తోటలో నుంచి జనాల పరుగులు.. ఏంటా అని వెళ్లి చూడగా..
బాబోయ్.. తోటలో నుంచి జనాల పరుగులు.. ఏంటా అని వెళ్లి చూడగా..
మీ ఆధార్‌ను ఎవరైనా వినియోగిస్తే తెలుసుకోవడం ఎలా? లాక్‌ చేయండిలా!
మీ ఆధార్‌ను ఎవరైనా వినియోగిస్తే తెలుసుకోవడం ఎలా? లాక్‌ చేయండిలా!
డయాబెటిస్‌ రోగులు ఈ యోగాసనాలు వేస్తే షుగర్ అదుపులోకి వస్తుంది
డయాబెటిస్‌ రోగులు ఈ యోగాసనాలు వేస్తే షుగర్ అదుపులోకి వస్తుంది
గుడ్‌న్యూస్‌.. Samsung Galaxy ఫోన్‌లపై భారీ తగ్గింపులు..
గుడ్‌న్యూస్‌.. Samsung Galaxy ఫోన్‌లపై భారీ తగ్గింపులు..
విద్యార్థి సంఘాల దాడి ఘటనపై స్పందించిన అల్లు అరవింద్
విద్యార్థి సంఘాల దాడి ఘటనపై స్పందించిన అల్లు అరవింద్
ఆ సమయంలో భరించలేని కడుపునొప్పి వేదిస్తుందా? బీ కేర్ ఫుల్..
ఆ సమయంలో భరించలేని కడుపునొప్పి వేదిస్తుందా? బీ కేర్ ఫుల్..
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఆ పథకాల్లో పెట్టుబడితో లాభాల పంట..ది బెస్ట్ ఈటీఎఫ్‌లు ఇవే..!
ఆ పథకాల్లో పెట్టుబడితో లాభాల పంట..ది బెస్ట్ ఈటీఎఫ్‌లు ఇవే..!