AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నిందితుడు ఓవరాక్షన్‌.. పోలీస్ లాకప్‌లో ఉన్నా.. ఫ్రెండ్స్‌తో రీల్స్‌ చేయిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు..!

నేరస్థులకు పోలీసులన్నా లెక్కలేకుండా పోతోందా..? అరెస్ట్‌ చేసి లాకప్‌లో పెట్టినా భయమనేదే ఉండటం లేదా..? అంటే హైదరాబాద్‌ బండ్లగూడ పోలీస్‌స్టేషన్‌లో ఓ నిందితుడి ఓవరాక్షన్‌ చూస్తే అలాగే అనిపించక మానదు. ప్రేమ పేరుతో తమ అమ్మాయిని ఎత్తుకెళ్లాడంటూ బండ్లగూడ పోలీసులను ఆశ్రయించింది ఓ తల్లి.

Hyderabad:  నిందితుడు ఓవరాక్షన్‌.. పోలీస్ లాకప్‌లో ఉన్నా.. ఫ్రెండ్స్‌తో రీల్స్‌ చేయిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు..!
Bandlaguda Ps
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jul 17, 2024 | 7:34 AM

Share

నేరస్థులకు పోలీసులన్నా లెక్కలేకుండా పోతోందా..? అరెస్ట్‌ చేసి లాకప్‌లో పెట్టినా భయమనేదే ఉండటం లేదా..? అంటే హైదరాబాద్‌ బండ్లగూడ పోలీస్‌స్టేషన్‌లో ఓ నిందితుడి ఓవరాక్షన్‌ చూస్తే అలాగే అనిపించక మానదు. ప్రేమ పేరుతో తమ అమ్మాయిని ఎత్తుకెళ్లాడంటూ బండ్లగూడ పోలీసులను ఆశ్రయించింది ఓ తల్లి. స్థానిక యువకుడు దస్తగిరిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికను మాత్రం కనిపెట్టలేకపోయారు. దీంతో బాలిక తల్లి పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో చేసేదేమీలేక నిందితుడు దస్తగిరిని తీసుకొచ్చి లాకప్‌లో పడేశారు బండ్లగూడ పోలీసులు.

ఇక లాకప్‌లో ఉన్నా బాలిక కుటుంంబంపై బెదిరింపులకు దిగాడు దస్తగిరి. పోలీస్‌స్టేషన్‌లోనే ఫ్రెండ్స్‌తో రీల్స్‌ చేయిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడు దస్తగిరి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిందితుడు దస్తగిరికి పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. అందుకు, పోలీస్‌స్టేషన్‌లో చేసిన రీల్సే రుజువు అంటున్నారు. పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల ముందే రీల్స్‌ చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తోంది బాలిక ఫ్యామిలీ. దీంతో సోషల్‌ మీడియా ద్వారా పోలీసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు పాతబస్తీ వాసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్