Nizamabad: ఎంతమంది కడుపులు కొట్టావ్‌రా సామి.. రెవెన్యూ ఉద్యోగి ఇంట్లో గుట్టులు గుట్టులుగా నగదు

నిజామాబాద్ నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి నరేందర్ ఇంట్లో ఏసీబీ రెయిడ్స్ చేసింది. తనిఖీల్లో రూ.6.07 కోట్ల విలువ చేసే అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. ఇంటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, కోటగల్లి, నిర్మల్‌లోని ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు అధికారులు.

Nizamabad: ఎంతమంది కడుపులు కొట్టావ్‌రా సామి.. రెవెన్యూ ఉద్యోగి ఇంట్లో గుట్టులు గుట్టులుగా నగదు
Anti Corruption Bureau Raids... Dasari Narendar, incharge revenue officer of the Nizamabad Municipal Corporation
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 09, 2024 | 8:14 PM

నిజామాబాద్ మున్సిపల్ ఆఫీసులో అవినీతి బాగోతం బయటపడింది. రెవెన్యూ సూపరింటెండెంట్‌ దాసరి నరేందర్‌ నివాసంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. నరేందర్ ఇంట్లో.. ఏకంగా 2 కోట్ల 93 లక్షల 81 వేల రూపాయల డబ్బు బయటపడింది. ఇంట్లో ఉన్న నోట్ల కట్టలు చూసి షాక్ అయిన ఏసీబీ అధికారులు… వాటిని లెక్కించేందుకు ప్రత్యేకంగా నోట్ల లెక్కింపు యంత్రాల్ని తీసుకొచ్చారు. అలాగే నరేందర్, అతని భార్య, అతని తల్లి బ్యాంక్ ఖాతాలో.. అక్షరాల కోటి 10 లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. బీరువాల్లో అర కిలో బంగారం, స్థిరాస్తులకు సంబంధించి 17 డాక్యుమెంట్లు బయటపడ్డాయి. మొత్తం ఆస్తుల విలువ రూ.6 కోట్ల 7 లక్షల ఉంటుందని… బహిరంగ మార్కెట్లో విటి విలువ భారీగా ఉంటుందని అంచనా వేశారు.

నరేందర్‌ ఇంటితోపాటు ఆఫీసు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేశారు. అదనపు ఆస్తులను వెలికితీసేందుకు మరిన్ని సోదాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆదాయం మించిన ఆస్తుల కేసులో నరేందర్‌పై కేసు నమోదు చేశారు. అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతుంది. నరేందర్‌ను హైదరాబాద్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపర్చనున్నారు. నరేందర్‌పై గత కొంత కాలంగా అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అంత మొత్తం సొమ్ము సంపాదించాలంటే.. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడటం తప్ప మరో మార్గం ద్వారా సాధ్యం కాదని గుర్తించి ఏసీబీ అధికారులు గుట్టు రట్టు చేశారు. ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ లంచం డిమాండ్ చేస్తే, చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ACB, TG, హైదరాబాద్ టోల్ ఫ్రీ నంబర్-1064ను సంప్రదించాలని ప్రజలకు ఏసీబీ అధికారులు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..