AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS News: సర్కార్ నౌకరీ ఇతనికి వెన్నతో పెట్టిన విద్య.. 8 ఉద్యోగాలు సాధించి సరికొత్త రికార్డు..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనం. అలాంటిది, ఓ యువకుడు మూడు గెజిటెడ్ ఉద్యోగాలతో సహా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించారు. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన గాదే సమ్మయ్య అనే సింగరేణి ఉద్యోగి కుమారుడు గాదే సాయి లెనిన్. ఇతను చిన్నతనం నుండి విద్యారంగంలో రాణిస్తున్నారు. సాయి లెనిన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన నాలుగు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణతను సాధించి నాలుగు ఉద్యోగాలను సాధించారు. అంతేకాకుండా సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్‎గా కూడా ఉద్యోగం సొంతం చేసుకున్నారు.

TS News: సర్కార్ నౌకరీ ఇతనికి వెన్నతో పెట్టిన విద్య.. 8 ఉద్యోగాలు సాధించి సరికొత్త రికార్డు..
Government Jobs
G Sampath Kumar
| Edited By: |

Updated on: Feb 19, 2024 | 5:39 PM

Share

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనం. అలాంటిది, ఓ యువకుడు మూడు గెజిటెడ్ ఉద్యోగాలతో సహా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించారు. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన గాదే సమ్మయ్య అనే సింగరేణి ఉద్యోగి కుమారుడు గాదే సాయి లెనిన్. ఇతను చిన్నతనం నుండి విద్యారంగంలో రాణిస్తున్నారు. సాయి లెనిన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన నాలుగు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణతను సాధించి నాలుగు ఉద్యోగాలను సాధించారు. అంతేకాకుండా సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్‎గా కూడా ఉద్యోగం సొంతం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన సమ్మయ్య సింగరేణి ఓపెన్ కాస్ట్ 1లో ఎలక్ట్రికల్ ఫ్లోర్ మెన్‎గా విధులు నిర్వహిస్తున్నారు. అతని కుమారుడైన సాయి లెనిన్ గోదావరిఖనిలో పదో తరగతి వరకు విద్యను అభ్యసించారు. ఇంటర్ హైదరాబాదులో, బీటెక్ వరంగల్‎లో పూర్తి చేసి గేట్ ద్వారా హైదరాబాద్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేసారు.

ఈ క్రమంలో రైతు కుటుంబం నుంచి వచ్చిన గోదావరిఖని ఎక్సైజ్ సిఐ స్ఫూర్తితో పోటి పరీక్షలకు సిద్ధమయ్యారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్, పాలిటెక్నిక్ లెక్చరర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, గ్రూప్ 4 పరీక్షలకు ప్రిపేర్ అయి ఉత్తీర్ణుడయ్యారు. దీంతోపాటు సింగరేణి సంస్థ నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ పరీక్షల్లో సైతం విజయం సాధించి ప్రస్తుతం కైరిగూడ ఓపెన్ కాస్ట్ గనిలో పనిచేస్తున్నారు. ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించిన సాయి లెనిన్‎ను కాలనీవాసులు ఘనంగా సన్మానించారు. తన విజయానికి తల్లిదండ్రులతో పాటు ఎక్సైజ్ సిఐ రమేష్ ప్రోత్సాహమే ప్రధాన కారణమని లెనిన్ తెలిపారు. కాగా, తమ కుమారున్ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు అందరూ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని లెనిన్ తల్లిదండ్రులు ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..