Hyderabad: గంట ముందే భూకంపాన్ని గుర్తించే టెక్నాలజీ.. హైదరాబాద్‌లోనే ల్యాబ్
హైదరాబాద్‌లోని ఈ ల్యాబ్ సముద్రగర్భంలో జరిగే కదలికలపై నిఘా ఉంచనుంది. ఈ ల్యాబ్ పూర్తిగా అధునాతన సెన్సార్‌లపై ఆధారపడి ఉంటుంది. భూమిపై ఉన్న అన్ని సముద్రాలు, మహాసముద్రాలలో అనేక కిలోమీటర్ల లోతు వరకు సంభవించే ప్రతి కదలిక నిమిషాల్లో తెలిసిపోతుంది. ఆ సమాచారాన్ని అంచనా వేయడానికి ఇప్పటికే ఉన్న...

దేశంలోని మొట్టమొదటి సినర్జిస్టిక్ ఓషన్ అబ్జర్వేషన్ ప్రిడిక్షన్ సర్వీస్ (SynOPS) ల్యాబ్‌ను ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్ సముద్రంలో సంభవించే భూకంపం, సునామీలను ఒక గంట ముందుగానే గుర్తించి, హెచ్చరికలు జారీ చేస్తుంది.
హైదరాబాద్‌లోని ఈ ల్యాబ్ సముద్రగర్భంలో జరిగే కదలికలపై నిఘా ఉంచనుంది. ఈ ల్యాబ్ పూర్తిగా అధునాతన సెన్సార్‌లపై ఆధారపడి ఉంటుంది. భూమిపై ఉన్న అన్ని సముద్రాలు, మహాసముద్రాలలో అనేక కిలోమీటర్ల లోతు వరకు సంభవించే ప్రతి కదలిక నిమిషాల్లో తెలిసిపోతుంది. ఆ సమాచారాన్ని అంచనా వేయడానికి ఇప్పటికే ఉన్న సిస్టమ్‌లలో SynOPS అత్యంత అధునాతన వ్యవస్థ అని చెబుతున్నారు. ఈ ల్యాబ్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ల్యాబ్‌కు సంబంధించిన అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు.
During my Hyderabad visit I’m glad to inaugurate the ‘Synergistic Ocean Observation Prediction Services(SynOPS) Facility- at the Indian National Centre for Ocean Information Services #INCOIS at Hyderabad. It’s of great utility services for our citizens. Also unveiled a thematic… pic.twitter.com/go6EyL62TG
— Kiren Rijiju (@KirenRijiju) February 16, 2024
ఇక ఈ ల్యాబ్ నుంచి వచ్చిన సమాచారం విపత్తు నిర్వహణ విభాగానికి పంపిస్తారు. NDRF, SDRF లాంటి బృందాలు సకాలంలో సహాయ చర్యలు, రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించడానికి ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు సునామీ, తుఫాను వంటి విపత్తుల గురించి సమాచారం కోసం అంతర్జాతీయ ఏజెన్సీల నుంచి సహాయం తీసుకునే వారు కానీ ప్రస్తుతం ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఈ ల్యాబ్‌తో దేశీయంగా సమాచారం పొందొచ్చు.
ఇక తుఫాన్‌లకు సంబంధించిన సమాచారాన్ని కూడా 3 నుంచి 4 రోజుల ముందుగానే Synops ల్యాబ్ ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో హిందూ, పసిఫిక్ మహాసముద్రాలతోపాటు అన్ని మహాసముద్రాల సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం సాధ్యమవుతుంది. ఈ వ్యవస్థ చేపల కదలిక గురించి కూడా సమాచారాన్ని అందించగలదు. సముద్రంలో ఏ దిశలో ఎక్కువ చేపలు తెలుసుకొని, మత్య్సగారులకు వివరాలను అందిస్తుంది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..




