Hyderabad: ఎవ్వరూ చూడడం లేదని వెకిలి వేశాలు వేశారు.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు
ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో పోకిరీల పనిపట్టారు పోలీసులు. రద్దీగా ఉన్న సమయంలో మహిళలతో అసభ్యకర చర్యలకు పాల్పడుతున్న కొంత మందిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. షీ టీమ్స్ సభ్యులు మఫ్టీలో తిరుగుతూ పోకిరీల వెకిలి చేష్టలను కెమెరాల్లో బంధిస్తూ మరీ ఆట కట్టిస్తున్నారు...

హైదరాబాద్ నగరంలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. మహిళలపై వేధింపులకు పాల్పడుతూ రాక్షస ఆనందం పొందుతున్నారు. కుటుంబంతో, ఫ్రెండ్స్‌తో సరదాగా గడుపుదామని బటయకు వచ్చిన మహిళలపై వెకిలిగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఈ దిశగా దృష్టీసారించిన పోలీసులు ఇలాంటి తాట తీసే విధంగా రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటూ బుద్ధి చెబుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో పోకిరీల పనిపట్టారు పోలీసులు. రద్దీగా ఉన్న సమయంలో మహిళలతో అసభ్యకర చర్యలకు పాల్పడుతున్న కొంత మందిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. షీ టీమ్స్ సభ్యులు మఫ్టీలో తిరుగుతూ పోకిరీల వెకిలి చేష్టలను కెమెరాల్లో బంధిస్తూ మరీ ఆట కట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నుమాయిష్‌లో మహిళలను వేధిస్తున్న 123 మంది పోకిరీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు షీటీమ్స్.
వీరిలో 55 మంది పోకిరీలకు రెండు నుంచి నాలుగు రోజుల పాటు నాంపల్లి కోర్టు జైల్ శిక్ష విధించించింది. ఇక మరో 51 మందికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ఇదిలా ఉంటే దొరికిన తర్వాత మాయ మాటలు చెప్పి బుకాయించడానికి వీలు లేకుండా వీడియో సాక్ష్యాలను సైతం పోలీసులు బయటపెడుతున్నారు. స్పై కెమెరాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలను రికార్డ్ చేసి మరీ కేసులు నమోద చేస్తున్నారు. ఇక మహిళలపై ఎలాంటి అసభ్యకర చర్యలకు పాల్పడ్డ కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే షీటీమ్స్‌కు కాంటాక్ట్ కావాలని సూచిస్తున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..




