AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీదేం భక్తిరా నాయనా.. స్వామీజీ చెప్పులకు పూజలు.. ఇంతలోనే షాకింగ్ ఘటన.. !

భక్తి ఉండాలి కాని, మరి ఇలా పిచ్చి భక్తి కూడా ఉండకూడదు.. అతి నమ్మకం కూడా మంచిది కాదంటారు. ఇప్పటికే మన దగ్గర ఉన్న దేవుళ్ళు చాలనట్లు.. ఎంతోమంది స్వామిజీలు, బాబాలు పుట్టుకొచ్చారు. వీరికి పూజలు చేయడమే కాకుండా కొత్తగా వారి పాదుకలు (చెప్పులు)లకు పూజలు చేస్తున్నారు. తాజాగా ఇలా ఈ పాదుకల (చెప్పుల) పూజలోనే పలువురికి గాయాలు అయ్యాయి.

మీదేం భక్తిరా నాయనా.. స్వామీజీ చెప్పులకు పూజలు.. ఇంతలోనే షాకింగ్ ఘటన.. !
Baba Padukalapuja
P Shivteja
| Edited By: |

Updated on: Apr 14, 2025 | 7:53 PM

Share

భక్తి ఉండాలి కాని, మరి ఇలా పిచ్చి భక్తి కూడా ఉండకూడదు.. అతి నమ్మకం కూడా మంచిది కాదంటారు. ఇప్పటికే మన దగ్గర ఉన్న దేవుళ్ళు చాలనట్లు.. ఎంతోమంది స్వామిజీలు, బాబాలు పుట్టుకొచ్చారు. వీరికి పూజలు చేయడమే కాకుండా కొత్తగా వారి పాదుకలు (చెప్పులు)లకు పూజలు చేస్తున్నారు. అయితే ఎవరి నమ్మకం వారిది. కానీ తాజాగా ఇలా ఈ పాదుకల (చెప్పుల) పూజలోనే పలువురికి గాయాలు అయ్యాయి. పూజలు చేస్తే గాయాలు ఏంటి అని అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదవాల్సిందే..!

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామ శివారులో సుమారు 2 వేల మందితో పాదుకలు (చెప్పులు)లకు పూజలు చేశారు. మహారాష్ట్రలోని ,నానిజ్ ధామ్ ఆశ్రమంకు చెందిన నరేంద్ర చారి మహరాజ్‌కు చెందిన పాదుకలు(చెప్పులు) పూజా కార్యక్రమం భక్తులు నిర్వహించారు. అయితే దీనికోసం వేసిన టెంట్లు, షామియానాలు ఒకేసారి కుప్పకూలిపోయాయి. ఓకేసారి పెద్ద ఎత్తున గాలి, దుమారం రావడంతో టెంట్లు కూలడంతో 100 మందికిపైగా భక్తులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారందరిని అంబులెన్సులలో నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు.

నరేంద్ర చారి మహరాజ్ పాదుకలకు పూజలు చేయడం ఇది రెండో కార్యక్రమం. ఇక్కడికి మహారాష్ట్ర నుండి దేగుళూర్, అక్కడి సరిహద్దు గ్రామలైన కంగ్టి మండలంలోని దేగులవాడి, బొర్గి, నాగాన్ పల్లి, సిర్గాపూర్, పోటీపల్లి, జుకల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల భక్తులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న పాల్గొంటారు. ఆయా గ్రామాల భక్తులు డబ్బులు పోగు చేసుకొని నరేంద్ర చారి మహరాజ్ పాదుకలు (చెప్పులు ) లక్షల్లో ఖరీదు చేసి తెప్పిచుకుని వాటికి పూజ చెయ్యడం ఈ ప్రాంత భక్తుల నమ్మకం. భక్తుల్లో కొంత మంది పొగుచేసిన డబ్బులో నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

ఈ క్రమంలోనే సోమవారం(ఏప్రిల్ 14) సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామ శివారులో రెండవసారి ఈ పూజ కార్యక్రమం కొనసాగిస్తుండగా ఈ అపశృతి చోటు చేసుకుంది. ఈ పూజా కార్యక్రమంలో గాయపడ్డ వారిని స్థానిక ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్ పరామర్శించారు. మరో వైపు ఇలా స్వామిజీలకే కాకుండా ఇప్పుడు కొత్తగా పాదుకలకు (చెప్పులకు) పూజ చెయ్యడం ఏంటని కొంతమంది ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
టమాటో రసం ఇలా పెడితే మూడు రోజులు ఫ్రెష్
టమాటో రసం ఇలా పెడితే మూడు రోజులు ఫ్రెష్
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు