Telangana: అవి చూసి నమ్మారో మీ కొంప కొల్లేరే.. నల్లగొండలో నయా ముఠా గుట్టు రట్టు..
మాయకులే ఈ ముఠా టార్గెట్. తమ వద్ద ఉన్న వజ్రాలను ప్రత్యేక రసాయనాల్లో ముంచితే బంగారంగా మారుతుందని నమ్మబలుకుతారు. కోట్లాది రూపాయల విలువైన వజ్రాలను ఇస్తామంటూ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాళ్లు అమాయకులను సినీ ఫక్కీలో మోసం చేస్తున్నారు. పలువురి నుంచి కోటి రూపాయలు వరకు ఈ ముఠా వసూలు చేసింది. చివరికి ఈ ముఠా పోలీసుల చేతికి చిక్కింది. వివరాల్లోకి వెళ్తే..

నల్గొండ జిల్లా త్రిపురారం మండలం శీత్యాతండాకు చెందిన బాలు, ఉషా నాయక్ , హైదరబాద్ కు చెందిన తాలిబ్ షేక్ లు ఈజీ మనీ కోసం అలవాటు పడి ముఠాగా ఏర్పడ్డారు. ఇందుకు అమాయకులే టార్గెట్ గా చేసుకున్నారు. ఈ ముఠా మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజక వర్గాల్లో విలువైన వజ్రాలు ఉన్నాయంటూ సినీ ఫక్కీలో డబ్బులు లాగి పలువురిని మోసగించింది. త్రిపురారం కు చెందిన నవ్య, శ్రీనివాస్ దంపతులు గతంలో మిర్యాలగూడలో గోల్డ్ షాప్ ను నిర్వహించేవారు. ఆ సమయంలో పరిచయమైన బాలు, ఉషా నాయక్ లు కొద్దిరోజుల క్రితం వజ్రాలు ఉన్నాయంటూ వీరి వద్దకు వచ్చారు. ఆ వజ్రాలను ముంబై నుంచి తీసుకొచ్చే ప్రత్యేక రసాయనంలో శుభ్రం చేస్తే బంగారం వస్తుందని నమ్మబలికారు. కోట్ల రూపాయల విలువైన వజ్రాలు మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మకాలనీలో ఒక గదిలో ఉన్నాయని నమ్మించి వీరి నుంచి రూ.37.50 లక్షలు వసూలు చేశారు. ముంబై నుంచి తాలిబ్ షేక్ తీసుకువచ్చిన ప్రత్యేక రసాయనాల్లో 5 డైమండ్స్ ను శుభ్రం చేస్తున్నట్టు ఈ ముఠా నటించింది. కాసేపటికి ముంబై నుంచి వచ్చిన డైమండ్స్ బాక్స్ మారిందంటూ సినీ ఫక్కీలో డ్రామాతో రక్త కట్టించారు.
ఇలా కోట్ల రూపాయల విలువైన వజ్రాలు ఉన్నాయంటూ పలువురిని ఈ ముఠా సినిమా ఫక్కీలో మోసగించింది. ఎవరి డబ్బులు వారికి ఇస్తామంటూ కాలం వెళ్లదీస్తుండటంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరుగురు వ్యక్తుల నుంచి ఈ ముఠా సుమారు కోటి రూపాయల వరకు వసూలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదును తీసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..