CBN Arrest: బాబు అరెస్ట్‌పై మోత్కుపల్లి తీవ్ర ఆగ్రహం.. ఆయనేం క్రిమినల్ కాదంటూ…
తాజాగా చంద్రబాబు అరెస్టును ఖండించారు బీఆర్‌ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో లక్షల బడ్జెట్ ఖర్చు పెట్టిన చంద్రబాబు ఎక్కడా తప్పు చేయలేదని విశ్వాసం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలో భాగంగానే అక్రమంగా సీఎం జగన్, చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టును రాజకీయాలకు అతీతంగా సీఎం కేసీఆర్ కూడా ఖండించాలన్నారు మోత్కుపల్లి నర్సింహులు.
మొన్న మంత్రి పువ్వాడ అజయ్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.. నిన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. ఇవాళ మోత్కుపల్లి నర్సింహులు ఇలా వరుసగా బీఆర్‌ఎస్ నేతలు చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు. మాజీ సీఎంను అరెస్ట్ చేసే విధానం ఇదా కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్.. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్, మంత్రి మల్లారెడ్డి.. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. అటు వైసీపీ నుంచి కూడా బీఆర్‌ఎస్‌పై కౌంటర్ అటాక్‌లు పడుతున్నాయి. ఇదే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా బీఆర్‌ఎస్ నేత మోత్కుపల్లి సైతం బాబు అరెస్ట్‌ను ఖండించారు. సీఎం కేసీఆర్ సైతం చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

