AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎమ్మెల్సీ కవితతో ఎంపీ ఆర్‌.కృష్ణయ్య భేటీ..  బీసీ బిల్లుపై వినతి

Telangana: ఎమ్మెల్సీ కవితతో ఎంపీ ఆర్‌.కృష్ణయ్య భేటీ.. బీసీ బిల్లుపై వినతి

Ram Naramaneni
|

Updated on: Sep 23, 2023 | 2:04 PM

Share

ఎమ్మెల్సీ కవితతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ఇతర బీసీ లీడర్స్ సమావేశమ్యయారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఒబీసీ కోట అమలు చేసేలా జాతీయ స్థాయిలో కృషి చేయాలని కోరారు.  మా వాటా మాకు దక్కే వరకు పోరాడుతాం, తిరగబడతామని చెప్పారు ఆర్. కృష్ణయ్య. బీసీ బిల్లు పెట్టకపోతే చరిత్రలో మచ్చ మిగులుతుందన్నారు.

ఎమ్మెల్సీ కవితతో ఎంపీ ఆర్‌.కృష్ణయ్య భేటీ అయ్యారు.  ఓబీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల సాధనపై చర్చించారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు అమలు చేసేలా కేంద్రాన్ని ఒత్తిడి చేయాలని కోరారు. దేశంలో 50 శాతం బీసీలకు న్యాయం చేసేలా చట్టాలు ఉండాలన్నారు. బీసీ బిల్లుకు సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 26వ తేదీన జలవిహార్‌లో బీసీ కులసంఘాలతో ఆయన సమావేశమవ్వనున్నారు.  పార్లమెంట్‌లో వెంటనే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు ఆర్‌.కృష్ణయ్య. లేదంటే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Published on: Sep 23, 2023 02:04 PM