Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీర తోటలో కోతి ఫ్లెక్సీని పెట్టిన రైతు.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

సమాజంలో మంత్రాలు తంత్రాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ.. నరుని కన్ను పడితే నాశనం అవుతారని పెద్దలు అన్నమాట నిజమేనని తెలుస్తుంది. దీని కోసమే సిద్దిపేట జిల్లాలో ఓ రైతు తన పొలంలో కోతి బొమ్మతో ఉన్న కటౌట్ పెట్టి వినూత్న మార్గంలో తన పంటను కాపాడుకుంటున్నాడు. ఓ రైతుకు తారు రోడ్డు పక్కనే వ్యవసాయ పొలం ఉంది. అందులో నెలరోజులు పండే బీర పండే సాగు చేశారు. అది ఏపుగా పెరిగి కాయలు కాయడంతో అటుగా వెళ్లే వాహన దారులు,బాటసారుల చూపు ఆ చేనుపై పడి దెబ్బ తింటుందన్న నేపంతో ఆ రైతు వినూత్న ఆలోచన చేసాడు.

Telangana: బీర తోటలో కోతి ఫ్లెక్సీని పెట్టిన రైతు.. ఎందుకో తెలిస్తే  షాక్ అవ్వాల్సిందే
Monkey Flex
Follow us
P Shivteja

| Edited By: Aravind B

Updated on: Sep 09, 2023 | 1:54 PM

సమాజంలో మంత్రాలు తంత్రాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ.. నరుని కన్ను పడితే నాశనం అవుతారని పెద్దలు అన్నమాట నిజమేనని తెలుస్తుంది. దీని కోసమే సిద్దిపేట జిల్లాలో ఓ రైతు తన పొలంలో కోతి బొమ్మతో ఉన్న కటౌట్ పెట్టి వినూత్న మార్గంలో తన పంటను కాపాడుకుంటున్నాడు. ఓ రైతుకు తారు రోడ్డు పక్కనే వ్యవసాయ పొలం ఉంది. అందులో నెలరోజులు పండే బీర పండే సాగు చేశారు. అది ఏపుగా పెరిగి కాయలు కాయడంతో అటుగా వెళ్లే వాహన దారులు,బాటసారుల చూపు ఆ చేనుపై పడి దెబ్బ తింటుందన్న నేపంతో ఆ రైతు వినూత్న ఆలోచన చేసాడు. ఓ కోతి ఫ్లెక్సీని తయారు చేపించి చేనులో పెట్టి నన్ను చూసి ఏడవకురా అంటూ.. పెద్ద అక్షరాలతో కొటేషన్ రాసి చేనులో ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు.

దీంతో అటుగా వెళ్లే ప్రయాణికుల కళ్ళు ఆ ఫ్లెక్స్‎పై పడి.. ఆ పంటకు ఎలాంటి హాని కలగదని పలువురు గుసగుసలాడుతున్నారు. నిజానికి.. అటుగా వెళ్లే వారి చూపంత ఆ పొలంపై కాకుండా ఆ ఫ్లెక్సీ పైకి మల్లుతుందని అంటున్నారు చాలా మంది. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియల్ గ్రామానికి చెందిన పోచమ్మ అనే రైతుకు తారు రోడ్డు పక్కనే ఎకరం భూమి ఉంది…అయితే అందులో నెల బీర పంట సాగు చేస్తోంది. వర్షాలు సమృద్ధిగా కురవడంతో పత్తి చేను ఏపుగా పెరిగి అద్భుతంగా పంట పండే అవకాశాలు కనిపించడంతో ఆ చుట్టూ పక్కల ఉండే జనాల కళ్ళు తన పంటపై పడకూడదని.. తమ పంటను రక్షించుకోవాలనే సంకల్పంతో ఏదైనా వినూత్న ప్రయత్నం చేయాలని ఆలోచనతో ఆ పంట రైతు..కోతి రూపంలో ఉన్న బ్యానర్ తయారు చేయించి తన చేనులో ఆ ఫ్లెక్సీ ని ఉంచి వపెద్ద పెద్ద అక్షరాలతో ఒక కొటేషన్ వ్రాసి ఉంచారు.

అటుగా వెళ్లే ప్రయాణికుల కళ్ళని కోతి బ్యానర్ పై నన్ను చూసి ఏడవకురా అనే అక్షరాలపైనే దృష్టి మళ్లించడంతో.. ఆ రైతు వేసిన పంట బాగానే ఏపుగానే ఉంది. చివరికి ఈ రైతు చేసిన ప్రయత్నం ఫలించి.. పంట పండుతుందా..రైతుకు ఫలితం ఇస్తుందా అని కోతితో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చూసి కొంతమంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా సాధరణంగా మొక్కజొన్న, చెరకు, కూరగాయలు పండించే పంటలకు రైతులు కాపాలా ఉంటారు. అయితే ఈ రైతు అలా కోతి బొమ్మను ఏర్పాటు చేయడం చాలా కొత్తగా ఉన్నట్లు రోడ్డు వెంబటి వెళ్లే వాహనాదారులు అంటున్నారు. అలాగే ఆ రైతు చేసిన ఆలోచనకి కూడా స్థానికంగా పలువురు ప్రశంసిస్తున్నారు. వాస్తవానికి రోడ్డు వెంట ఉండే పంటలకు కొంతవరకు రక్షణ ఉండదు. ఎందుకంటే వారు ఏదైనా కూరగాయలు పండిచినట్లైతే అటుగా వెళ్లేవారి కళ్లు కచ్చితంగా వాటిపైనే పడతాయి. ఈ క్రమంలో ఆ రైతు ఇలా కోతి ఫ్లేక్సీ ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయం అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..