Telangana: బుల్లెట్‌ బండిపై రాలేను.. ఆర్టీసీ బస్సులోనే వస్తాను.. ఇష్టమైతేనే పెళ్లి చేసుకో.. వైరలవుతోన్న డిపో మేనేజర్‌ ట్వీట్‌

'నీ బుల్లెట్‌ బండెక్కి వచ్చేస్తా పా..డుగ్గు డుగ్గు డుగ్గు'.. సోషల్‌ మీడియాలో ఈ పాటకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సింగర్‌ మోహన భోగరాజు ఆలపించిన

Telangana: బుల్లెట్‌ బండిపై రాలేను.. ఆర్టీసీ బస్సులోనే వస్తాను.. ఇష్టమైతేనే పెళ్లి చేసుకో.. వైరలవుతోన్న డిపో మేనేజర్‌ ట్వీట్‌
Follow us

|

Updated on: Nov 02, 2021 | 2:16 PM

‘నీ బుల్లెట్‌ బండెక్కి వచ్చేస్తా పా..డుగ్గు డుగ్గు డుగ్గు’.. సోషల్‌ మీడియాలో ఈ పాటకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.   ప్రముఖ సింగర్ మోహన భోగరాజు ఆలపించిన ఈ పాటను ఎంతో మంది రీక్రియేషన్‌ చేశారు. అద్భుతమైన స్టెప్పులేస్తూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్‌ జిల్లా హనుమ కొండ ఆర్టీసీ డిపో మేనేజర్‌ బుల్లెట్‌ బండి పాటను ఉపయోగించుకుంటూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

నిన్న సజ్జనార్‌.. నేడు డిపో మేనేజర్‌

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశానంటుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు వీటి ధరలు పెరుగుతుండడంతో బైక్‌ ఎక్కేందుకు చాలామంది ఆలోచిస్తున్నారు. వీలైనంతవరకు బస్సులు, మెట్రో వంటి ప్రజారవాణా సౌకర్యాలనే వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించమని కోరుతూ ఇటీవల టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రిన్స్‌ మహేష్‌బాబుతో ఓ సెటైరికల్‌ పోస్ట్‌ షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వరంగల్‌ ఆర్టీసీ బస్‌ డిపో మేనేజర్‌ కూడా ఇలాగే ఓ పోస్ట్‌ పంచుకున్నాడు. బుల్లెట్‌ బండి పాట, పెట్రోల్‌ ధరలు, ఆర్టీసీ బస్సులు..ఇలా మూడింటికి ముడిపెడుతూ అతను షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్ట్‌లో ఓ పెళ్లి కొడుకు ‘పెట్రోల్‌ రూ.120 అయ్యింది. నువ్వు కోరినట్లు డుగ్గు.. డుగ్గు.. డుగ్గు బుల్లెట్‌ బండిపై రాలేను. ఆర్టీసీ బస్సులోనే వస్తాను. నీకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకో’ అని పెళ్లికూతురుతో చెప్పినట్లు మీమ్‌ను క్రియేట్‌ చేశారు. ఇది నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తోంది.

Also read:

Spectacle Marks: కళ్ల జోడు వాడకంతో ముక్కుపై మచ్చలు ఏర్పడుతున్నాయా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

Huzurabad By Election Counting: సేవ చేసేవారికి ఇది నిజమైన గుర్తింపు.. హుజురాబాద్ ఫలితాలపై బండి సంజయ్ కామెంట్స్..

Vegetable prices: సామాన్యులకు షాక్..పెట్రోల్‌, డీజిల్‌కు పోటీగా కూరగాయలు