Khammam: అర్థరాత్రి బైక్‌పై వెళ్తున్న యువకులను ఆపిన పోలీసులు.. విచారణలో స్టన్ అయ్యే నిజం వెలుగులోకి
రాత్రి పూట బైక్‌పై వెళ్తూ పోలీసులకు కాస్త మిస్టీరియస్‌గా కనిపించారు యువకులు. దీంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. వారి నుంచి పొంతన లేని సమాధానాలు వచ్చాయి.
Telangana: పోలీసులు ఎంత అలెర్ట్‌గా ఉంటున్నా గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఈ మాయదారి మత్తు పట్టుబడటం ఆందోళన కలిగిస్తుంది. పోలీసుల వేట అధికంగా ఉండటంతో స్మగ్లర్స్ మత్తును గంజాయిని ట్రాన్స్‌పోర్ట్ చేసేందుకు కొత్త.. కొత్త మార్గాలను వెతుకుతున్నారు. పోలీసులే విస్తుపోయేలా తమ అతి తెలివి ఉపయోగిస్తున్నారు. పుష్ప(Pushpa) సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) కంటే ఎక్కువ ఇస్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. స్మగ్లింగ్‌లో రోజుకో సరికొత్త స్టైల్ ను ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు. ఇంకొందరు అయితే మరీ బరి తెగించి.. ట్రైన్స్, బస్సుల్లో కూడా గుట్టు చప్పుడు కాకుండా రవాణా చేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోని ఓ రూరల్ ఏరియాలో భారీగా గంజాయి పట్టుబడటం సంచలనంగా మారింది. జిల్లాలోని కూసుమంచి మండలం చౌటపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 63 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నైట్ టైమ్‌లో అనుమానాస్పదంగా సంచరించడంతో.. అదుపులోకి తీసుకోగా గంజాయి అక్రమ రవాణా వెలుగు చూసిందని పోలీసులు తెలిపారు.
కూసుమంచి సీఐ కొప్పుల సతీష్, ఎస్‌ఐ నందీప్ తన సిబ్బందితో కలిసి బైక్‌పై గంజాయి తరలిస్తుండగా యువకులు వెంకటేష్, నవీన్, శ్రీనివాస్, రమేష్, శ్రీరామ్‌లను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగించిన బైక్, 4 వీలర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి బుధవారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నిందితులు మహబూబాబాద్ జిల్లా నుంచి గంజాయిని సేకరించినట్లు పోలీసులు తెలిపారు.