Nirmal: ఛార్జర్‌ పిన్‌ను నోట్లో పెట్టుకున్న చిన్నారి.. షాక్ కొట్టడంతో…

చిన్నారి పాలిట మృత్యుపాశమైంది సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ కేబుల్‌. విద్యుత్తు బోర్డుకు వేలాడుతున్న సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ పిన్‌ను నోట్లో పెట్టుకోగా విద్యుదాఘాతానికి గురై పాప అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

Nirmal: ఛార్జర్‌ పిన్‌ను నోట్లో పెట్టుకున్న చిన్నారి.. షాక్ కొట్టడంతో...
Aaradhya
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 02, 2024 | 9:16 AM

సెల్‌ఫోన్‌ చార్జర్‌ మృత్యుపాశం అయింది. ఒక చిన్నారి ప్రాణం తీసింది. నిర్మల్‌ జిల్లా కడెం మండలంలోని కొత్త మద్దిపడగ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఏడాదిన్నర చిన్నారి దుర్గం ఆరాధ్య అనే పాప, విద్యుత్తు బోర్డుకు వేలాడుతున్న సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ కేబుల్‌ను నోట్లో పెట్టుకుంది. వెంటనే ఆ పసికందుకు షాక్‌ కొట్టింది. ఆ విద్యుత్‌ షాక్‌ను ఈ శిశువు తట్టుకోలేకపోయింది. ఖానాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాని అప్పటికే పసిపాప చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇంటిదీపం ఆరడంతో, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్తమద్దిపడిగకు చెందిన దుర్గం రాజలింగు, సుశీల దంపతుల రెండో కుమార్తె ఆరాధ్య ఉంది. ఏడాదిన్నర వయస్సు ఉన్న ఆ పాప గురువారం రాత్రి ఇంట్లో ఆడుకుంటూ.. విద్యుత్తు బోర్డుకు వేలాడుతున్న సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ పిన్‌ను నోట్లో పెట్టుకోగా షాక్ కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే తల్లిదండ్రులు ఖానాపూర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన డాక్టర్లు చిన్నారి మరణించినట్లు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే