AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Python: 10 అడుగుల కొండ చిలువ హల్ చల్.. సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలిన యువకులు

గిరి నాగు, తాచుపాములు వంటివి ఇళ్లల్లో చేరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ కొండ చిలువ హల్ చల్ చేసింది. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డు సింగరేణి మెయిన్ ఆస్పత్రి ఏరియా గౌతమ్ నగర్ లో 10 అడుగుల కొండ చిలువ ప్రత్యక్షం అయింది. భారీ కొండ చిలువను చూసిన స్థానికులు భయ బ్రాంతులకు గురయ్యారు.

Python: 10 అడుగుల కొండ చిలువ హల్ చల్.. సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలిన యువకులు
Python Hul Chul
N Narayana Rao
| Edited By: |

Updated on: Sep 07, 2023 | 2:31 PM

Share

అరణ్యాల్లో నివసించాల్సిన వన్య మృగాలు పులులు, సింహాలు, ఏనుగులు సహా కొండ చిలువలు కూడా జనావాసాల బాట పట్టాయి. ఇటీవల పుణ్యక్షేత్రాల్లో సహా అనేక ప్రాంతాల్లో పులులు, ఏనుగులు హల్ చల్ చేస్తుంటే.. మరోవైపు గిరి నాగు, తాచుపాములు వంటివి ఇళ్లల్లో చేరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ కొండ చిలువ హల్ చల్ చేసింది.

కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డు సింగరేణి మెయిన్ ఆస్పత్రి ఏరియా గౌతమ్ నగర్ లో 10 అడుగుల కొండ చిలువ ప్రత్యక్షం అయింది. భారీ కొండ చిలువను చూసిన స్థానికులు భయ బ్రాంతులకు గురయ్యారు. బొడ్డురాయి ఏర్పాటు కోసం పొదలను తొలగించి స్థలాన్ని శుభ్రం చేస్తుండగా భారీ కొండచిలువ ఒక్కసారిగా బయటకు వచ్చింది. పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి ప్రవేశించింది. దీంతో బస్తీ వాసులు వణికి పోయారు సమాచారం తెలుసుకున్న స్థానిక యువకులు ధైర్యం చేసి కొండచిలువకు ప్రాణహాని తలపెట్టకుండా చాకచక్యంగా పట్టుకున్నారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ సిబ్బంది సహాయంతో సమీప అటవీ ప్రాంతంలో కొండచిలువను సురక్షితంగా వదిలిపెట్టారు.

కొండ చిలువలు అటవీ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఆసియా దేశాలైన భారత్, పాకిస్తాన్, చైనా, శ్రీలంక, ఇండోనేషియా వంటి ప్రాంతాల్లో కనిపిస్తాయి. అంతేకాదు భారీ కొండచిలువలు సహారా ఎడారికి దక్షిణ ప్రాంతాల్లో , ఆఫ్రికాలోని ఉష్ణప్రాంతాల్లో కూడా కనిపిస్తాయి. వీటి ప్రధాన ఆహారం ఇతర జంతువులు.. తమకు దొరికిన జంతువులను ముందుగా తమ శరీరంతో చుట్టి.. ఉక్కిరి బిక్కిరి చేసి తర్వాత వాటిని మింగి తాపీగా అరిగించుకుంటుంది. ఒకొక్కసారి కొండ చిలువ ఏకంగా మనుషులను కూడా మింగి ఆకలి తీర్చుకుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్