తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాశీ సింగ్. గ్లామర్, అభినయంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు పంచుకుంది.
ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే తాను ఒక లెక్చరర్‌తో ప్రేమలో పడ్డానని వెల్లడించారు. స్కూల్ డేస్ పూర్తయ్యాక కాలేజీలో చేరినప్పుడు నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు.
అతను మాకు లెక్చరర్ కూడా. కాలేజీలో అతను నాకు చాలా ఫేవరబుల్ గా ఉండేవారు. పరీక్షల సమయంలో క్వశ్చన్ పేపర్లు కూడా ముందే ఇచ్చేవారు అంటూ చెప్పుకొచ్చింది.
వైవా వంటి సందర్భాల్లో నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగకుండా, ఇద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ టైమ్ పాస్ చేసేవాళ్లం అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రాశీ.
అయితే ఆ సమయంలో తన వయసు 17 ఏళ్లు మాత్రమేనని, వారిద్దరి మధ్య ఎలాంటి హద్దులు దాటలేదని ఆమె స్పష్టం చేశారు. కొన్నేళ్ల క్రితం ఆయనకు వివాహం జరిగింది.
ఇప్పటికీ ఆయన నాతో టచ్ లోనే ఉన్నారు. నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుంటారు. ఆయన భార్య కూడా నన్ను ఫాలో అవుతూ సోషల్ మీడియాలో టచ్ లో ఉంటారు అని తెలిపింది.
మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మించిన ‘త్రీ రోజెస్’ సీజన్ 2లో ఈషా రెబ్బా, కుషిత కల్లపుతో కలిసి రాశీ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటున్నారు.