AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spam Calss: ఆ మొబైల్ ఫోన్లు అన్నీ బ్యాన్.. కేంద్రం సంచలన నిర్ణయం

దేశవ్యాప్తంగా ఉన్న ఈ మొబైల్ హ్యాండ్ సెట్లపై బ్యాన్ వేయాలని టెలికాం కంపెనీలకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే 20 లక్షల మొబైల్ కనెక్షన్లకు రీవెరిఫికేషన్ చేయాలని సూచించింది. డిజిటల్ మోసాల నుంచి పౌరులను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Spam Calss: ఆ మొబైల్ ఫోన్లు అన్నీ బ్యాన్.. కేంద్రం సంచలన నిర్ణయం
Spam Calls
Ranjith Muppidi
| Edited By: |

Updated on: May 15, 2024 | 8:31 PM

Share

మొబైల్ ఫోన్ వాడే అందరికీ అలెర్ట్. టెలికం కంపెనీలకు గవర్నమెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సైబర్ క్రైమ్‌లో పాలు పంచుకున్న 28,200 మొబైల్ ఫోన్లపై నిషేధం విధించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం అమలులోకి ఉంటుంది. అలాగే మొబైల్ సిమ్ కార్డులకు సంబంధించి కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డులను రీవెరిఫికేషన్ చేసుకోవాలని సూచించింది. 20 లక్షల మొబైల్ కనెక్షన్లకు రీవెరిఫికేషన్ చేయాలని టెలికాం సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఒకవేళ సిమ్ కార్డుల రీవెరిఫికేషన్ విఫలమైతే.. ఆ సిమ్ కనెక్షన్లను తొలగించాలని కంపెనీలకు కేంద్రం సూచించింది. అందువల్ల సిమ్ కార్డు యూజర్లు, మొబైల్ హ్యాండ్ సెట్ ఉన్నవారు ఈ విషయంపై స్పష్టతతో ఉండాలి. సైబర్ క్రైమ్స్‌ను అడ్డుకోవాలనే టార్గెట్‌గా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం వద్ద డేటా ప్రకారం 28,200 మొబైల్ హ్యాండ్ సెట్స్.. సైబర్ క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయ్యాయి. ఈ మొబైల్ హ్యాండ్ సెట్స్‌లో దాదాపు 20 లక్షల నెంబర్లను వినియోగించారు. రీవెరిఫికేషన్ అనంతరం ఈ సిమ్ కార్డులు అన్నింటిపై నిషేధం అమల్లోకి వస్తుంది. ఫోన్లపై కూడా బ్యాన్ పడనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఈ మొబైల్ హ్యాండ్ సెట్లపై బ్యాన్ వేయాలని టెలికాం కంపెనీలకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే 20 లక్షల మొబైల్ కనెక్షన్లకు రీవెరిఫికేషన్ చేయాలని సూచించింది. డిజిటల్ మోసాల నుంచి పౌరులను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ప్రభుత్వం ఇటీవలనే డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టింది . దీని ద్వారా సైబర్ క్రైమ్స్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్‌‌కు అడ్డుకట్ట వేయవచ్చు. ఇన్‌ఫర్మేషన్ ఎక్స్చేంజ్, రియల్‌టైమ్‌ ఇంటెలిజెన్స్ షేరింగ్, ఇతర విభాగాల మధ్య కోఆర్డినేషన్ వంటివి ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా సులభంగా జరపొచ్చు. టెలికం కంపెనీలు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఐడెంటిటీ డాక్యుమెంట్ ఇష్యూయింగ్ అథారిటీస్ ఇలా పలు రకాల విభాగాలు అన్నీ ఈ ప్లాట్‌ఫామ్ కింద లింకై ఉంటాయి. కలిసి పని చేస్తాయి. అందువల్ల సమస్యలను వేగంగా పరిష్కరించే వీలుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..