AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: దళితవాచ్‌మెన్‌పై హోంగార్డుల దాష్టీకం..! వీడియో చూసి మండిపడుతున్న నెటిజన్లు.. పోలీసులపై ఫైర్..

ద్దరు హోంగార్డులు వీర్ బహదూర్, రాంపాల్‌కి వీరేంద్రతో గొడవకు దిగారు. ఈ వివాదంలో హోంగార్డులిద్దరూ వీరేంద్రతో ఘర్షణకు దిగారు. హోంగార్డులు చేసిన వేధింపులను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దళిత వ్యక్తి వీరేంద్ర ఇద్దరు హోంగార్డులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేశారు.

Watch Video: దళితవాచ్‌మెన్‌పై హోంగార్డుల దాష్టీకం..! వీడియో చూసి మండిపడుతున్న నెటిజన్లు.. పోలీసులపై ఫైర్..
Dalit Man Kicked By Home Gu
Jyothi Gadda
|

Updated on: May 15, 2024 | 7:11 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బరేలీలోని నవాబ్‌గంజ్ తహసీల్‌లో ఇద్దరు హోంగార్డులు గూండాయిజం ప్రదర్శించి దళిత వాచ్‌మెన్‌ను తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఇద్దరు హోంగార్డులు దళిత వాచ్‌మెన్‌ను బూటు కాళ్లతో తన్నడం, కొట్టడం కనిపిస్తుంది. వాచ్‌మెన్ ఫిర్యాదు మేరకు నవాబ్‌గంజ్ కొత్వాలిలోని హోంగార్డులిద్దరిపైనా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సమాచారం ప్రకారం, బరేలీలోని నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా గ్రామానికి చెందిన వీరేంద్ర కుమార్ వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రోజున వీరేంద్ర కుమార్‌ తన భూమి దస్తావేజు కోసం తహసీల్‌ కార్యాలయానికి వెళ్లాడు. అయితే అక్కడ ఉన్న హోంగార్డులు వీరేంద్ర కుమార్‌ను కులం పేరుతో దూషించారు. ఉచితంగా రేషన్‌ తీసుకుంటున్న వారు ప్రభుత్వానికి ఓటు వేయడం లేదని వ్యంగ్యంగా తిడుతూ.. అతన్ని చుట్టుముట్టారు. ఇద్దరు హోంగార్డులు వీర్ బహదూర్, రాంపాల్‌కి వీరేంద్రతో గొడవకు దిగారు. ఈ వివాదంలో హోంగార్డులిద్దరూ వీరేంద్రతో ఘర్షణకు దిగారు. హోంగార్డులు చేసిన వేధింపులను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దళిత వ్యక్తి వీరేంద్ర ఇద్దరు హోంగార్డులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వీడియో చాలా వేగంగా వైరల్ అయ్యింది. ఆ ఇద్దరు హోంగార్డులపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేశారు. UP పోలీసులను అప్రమత్తం చేయాలని కోరారు. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై వ్యాఖ్యానించడంతో పాటు UP పోలీసులను నిలదీశారు. దీంతో బరేలీ పోలీసులు స్వయంగా దీనిపై ట్వీట్ చేస్తూ ప్రజలకు సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని బరేలీ పోలీసులు హామీ ఇచ్చారు. నిందితులైన హోంగార్డులపై విచారణ జరుపుతున్నామని, ఈ కేసులో బాధితుడైన దళిత వాచ్‌మెన్‌కు తగిన న్యాయం జరుగుతుందని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..