AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: వాట్సాప్‌లో అదిరే ఫీచర్.. ఇకపై మీరు మర్చిపోయిన అదే గుర్తుచేస్తుంది.. ఎలా అంటే..?

వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూనే ఉంటుంది. యూజర్ల ప్రైవసీకి పెద్దపీట వేస్తూ సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. ఇప్పుడు మరో ఫీచర్‌ని తీసుకొచ్చింది. మీరు బిజీగా ఉండి ముఖ్యమైన మెసేజులకు రిప్లై ఇవ్వలేకపోతున్నామని ఫీల్ అవుతున్నారా..? ఇకపై ఆ చింత అవసరం లేదు. మీకోసమే వాట్సప్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.

Whatsapp: వాట్సాప్‌లో అదిరే ఫీచర్.. ఇకపై మీరు మర్చిపోయిన అదే గుర్తుచేస్తుంది.. ఎలా అంటే..?
Whatsapp Remind Me feature
Krishna S
|

Updated on: Jul 28, 2025 | 3:07 PM

Share

వాట్సాప్ అనేది మనిషి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది. వాట్సప్ వచ్చిన నుంచి డైరెక్ట్‌గా మనుషులతో మాట్లాడడం తగ్గిపోయింది. ఏం చెప్పాలన్నా మెసేజ్ చేస్తే సరిపోతుంది. అయితే కొన్ని సార్లు బిజీగా ఉండడం వల్ల ముఖ్యమైన మెసేజ్‌లు చదివి, రిప్లై ఇవ్వడం మర్చిపోతాము. ఆ తర్వాత దాని గురించే పట్టించుకోం. ఇకపై అలా జరగదు. ఎందుకంటే వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా యూజర్ల కోసం రిమైండ్ మీ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. బిజీ లైఫ్ స్టైల్‌తో ముఖ్యమైన మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం మర్చిపోయే వారికి ఇది బాగా ఉపయోగపడనుంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

రిమైండ్ మీ ఫీచర్ అంటే ఏమిటి?

వాట్సాప్ బీటా వెర్షన్ 2.25.21.14లో ఈ కొత్త ఫీచర్ యూజర్లకు ఏదైనా చాట్‌కు సంబంధించి రిమైండర్‌ను సెట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. చాట్‌కు సంబంధించి ముఖ్యమైన సందేశాన్ని మర్చిపోకుండా అది టైమ్‌కు నోటిఫికేషన్‌తో గుర్తు చేస్తుంది. ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది టెక్స్ట్‌పై మాత్రమే కాకుండా, ఫొటోలు, వీడియోలు, ఆడియో, డాక్యుమెంట్లకు కూడా పనిచేస్తుంది.

రిమైండ్ మీ ఫీచర్‌ను ఎలా వాడాలి?

దీన్ని ఉపయోగించడం సులభం. దీని కోసం, మీరు రిమైండర్‌ను సెట్ చేయాలనుకుంటున్న చాట్‌పై ఎక్కువసేపు ప్రెస్ చేయండి. స్క్రీన్ పైభాగంలో బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఒక మెనూ ఓపెన్ అవుతుంది. దీనిలో రిమైండర్ కోసం నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో 2 గంటలు, 8 గంటలు, 24 గంటలు, కస్టమ్ అని ఉంటుంది. అందులో ఏ టైమ్ సెట్ చేసుకుంటే అప్పుడు మీకు వాట్సాప్ నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ రిమైండర్‌ను తీసేయాలనుకుంటే ఆ చాట్‌ను మళ్ళీ ప్రెస్ చేసి.. బెల్ ఐకాన్‌పై క్లిక్ చేయడం ద్వారా రిమైండర్‌ను తొలగించవచ్చు.

ఈ ఫీచర్ ఎందుకు స్పెషల్?

ఈ ఫీచర్ స్టార్ మెసేజ్ లేదా పిన్ చాట్ కంటే భిన్నంగా ఉంటుంది. దీనిలో డైరెక్ట్ నోటిఫికేషన్ గుర్తు చేస్తుంది. దాంతో ఇంపార్టెంట్ చాట్స్ గురించి మర్చిపోకుండా ఉంటారు.

క్విక్ రీక్యాప్: మరో కొత్త ఫీచర్

వాట్సాప్ క్విక్ రీక్యాప్ అనే మరో కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ యూజర్లకు చదవని చాట్‌ల సారాంశాన్ని తెలియజేస్తుంది. ఈ ఫీచర్ ద్వా అన్‌రీడ్ మెసేజ్‌లకు సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని ఈజీగా చదవచ్చు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..