Whatsapp: బ్యాకప్ చేయకుండానే డేటా ట్రాన్స్‌ఫర్.. వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్
సాధారణంగా వాట్సాప్ ఉపయోగిస్తున్న తరుణంలో డేటా పెద్ద ఎత్తున స్టోర్ అవుతుంది. ఒకవేళ కొత్త ఫోన్‌ను కొనుగోలు చేసిన సమయంలో పాత ఫోన్‌లో ఉన్న వాట్సాప్ డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యాకప్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. పాత ఫోన్‌లో డేటాను బ్యాకప్ చేసుకున్న తర్వాత కొత్త ఫోన్‌లో రీస్టోర్...

యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకురావడంతో ముందు వరుసలో ఉంటుంది వాట్సాప్. అందుకే ఎన్న రకాల మెసేజింగ్ యాప్స్ అందుబాటులోకి వస్తున్నా వాట్సాప్‌కు ఏమాత్రం క్రేజ్ తగ్గకపోవడానికి ఇదే కారణంగా చెప్పొచ్చు. ప్రైవసీతో పాటు మరెన్నో అంశాల్లో కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తున్న వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.
సాధారణంగా వాట్సాప్ ఉపయోగిస్తున్న తరుణంలో డేటా పెద్ద ఎత్తున స్టోర్ అవుతుంది. ఒకవేళ కొత్త ఫోన్‌ను కొనుగోలు చేసిన సమయంలో పాత ఫోన్‌లో ఉన్న వాట్సాప్ డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యాకప్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. పాత ఫోన్‌లో డేటాను బ్యాకప్ చేసుకున్న తర్వాత కొత్త ఫోన్‌లో రీస్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తాజాగా వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌తో బ్యాకప్ అవసరం లేకుండానే డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
డేటా బ్యాకప్ చేయకుండానే వాట్సప్‌లోని చాట్ హిస్టరీని కొత్త స్మార్ట్‌ఫోన్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. వాట్సాప్ తీసుకొచ్చిన వాట్సాప్ చాట్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం పాత ఫోన్‌తో పాటు కొత్త ఫోన్‌కు కూడా మీ దగ్గరే ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా రెండు స్మార్ట్ ఫోన్‌లు ఒకే వైఫై నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయ్యుండాలి. ఇంతకీ ఈ పీచర్‌ను ఎలాఈ ఉపయోగించుకోవాలంటే..
* ఇందుకోసం ముందుగా మీ స్మార్ట్ ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
* అనంతరం చాట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. చాట్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* వెంటనే మీ పాత ఫోన్‌లో చాట్ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి ప్రక్రియ మీ పాత ఫోన్‌లో ప్రారంభం అవుతుంది. ఇక్కడో క్యూఆర్ కోడ్ స్కానర్ ఓపెన్ అవుతుంది.
* అనంతరం కొత్త ఫోన్‌లో వాట్సప్ ఇన్‌స్టాల్ చేసి, అదే ఫోన్ నెంబర్‌తో లాగిన్ కావాల్సి ఉంటుంది.
* పాత ఫోన్‌కు వచ్చే వెరిఫికేషన్ కోడ్‌ను కొత్త దాంట్లో ఎంటర్ చేయాలి.
* తర్వాత కొత్త ఫోన్‌లో చూపించే క్యూఆర్ కోడ్‌ను పాత ఫోన్‌లో చూపించే స్కానర్‌తో స్కాన్ చేయాలి.
* దీంతో వెంటనే పాత ఫోన్‌లో ఉన్న డేటా మొత్తం కొత్త ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది.
* ఈ ప్రాసెస్ పూర్తయ్యే వరకు రెండు ఫోన్లూ పక్కపక్కనే ఉండాలి. అలాగే రెండు ఫోన్‌ల స్క్రీన్‌లు కూడా ఆన్‌లోనే ఉండాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..




