Croma Sale: క్రోమా రిపబ్లిక్ సేల్‌లో ఆ ఉత్పత్తులపై అదిరే ఆఫర్లు.. కొనుగోలుకు నేడే ఆఖరు..!
టాటా యాజమాన్యంలోని ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన క్రోమా తన రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా మొబైల్ ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు మరిన్ని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తోంది. వివిధ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసే మరింత తక్కువ ధరకే వాటిని కొనుగోలు చేయవచ్చు. క్రోమా రిపబ్లిక్ డే 2024 సేల్ సందర్భంగా కొన్ని ఉత్పత్తుల ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్స్‌లో కూడా లేనంత ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం భారతదేశంలోని ఆన్‌లైన్ మార్కెట్‌లో రిపబ్లిక్ డే సేల్ హవా నడుస్తుంది. రిపబ్లిక్ డే పూర్తయినా కొన్ని ప్లాట్‌ఫారమ్స్ సేల్‌ను ఇంకా కొనసాగిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ కోసం టాటా యాజమాన్యంలోని ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన క్రోమా తన రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా మొబైల్ ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు మరిన్ని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తోంది. వివిధ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసే మరింత తక్కువ ధరకే వాటిని కొనుగోలు చేయవచ్చు. క్రోమా రిపబ్లిక్ డే 2024 సేల్ సందర్భంగా కొన్ని ఉత్పత్తుల ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్స్‌లో కూడా లేనంత ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సేల్ ఆదివారంతో ముగుస్తుండడంతో కొనుగోలుదారులు త్వరపడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో క్రోమా రిపబ్లిక్ సేల్ అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
ఏసర్ 43 అంగుళాల స్మార్ట్ టీవీ
43 అంగుళాల ఏర్ స్మార్ట్ టీవీ పూర్తి హెచ్‌డీ రిజల్యూషన్‌తో పాటు 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేటుతో వస్తుంది. గూగుల్ టీవీ ఆధారంగా నడిచే ఈ టీవీ డాల్బీ అట్మోస్ మద్దతుతో 30 వాట్స్ అంతర్నిర్మిత స్పీకర్లతో పని చేస్తుంది. ఈ టీవీ 6.5 ఎంఎస్ ప్రతిస్పందన సమయాన్ని కలిగి ఉంది. అలాగే గూగుల్ వాయిస్ అసిస్టెంట్, అంతర్నిర్మిత క్రోమ్ కాస్ట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ టీవీలో రెండు హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, రెండు యూఎస్‌బీ పోర్ట్‌లతో పాటు వైఫై అందుబాటులో ఉంటే ఈ టీవీను రూ.19,999కి కొనుగోలు చేయవచ్చు.
సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ9 ప్లస్
మీరు మంచి ట్యాబ్ కొనుగోలు చేయడానికి ఎదురుచూస్తుంటే సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ 9 ప్లస్ మంచి ఎంపిక. క్రోమా రిపబ్లిక్ సేల్‌లో ఈ ట్యాబ్ కొనుగోలుకు ఆఫర్ ప్రైస్‌లో అందుబాటులో ఉంది. స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 11 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వచ్చే ఈ ట్యాబ్ అందరినీ ఆకర్షిస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా వన్ యూఐ 5.1ద్వారా పని చేసే ఈ ఫోన్ గరిష్టంగా 8 జీబీ + 128 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఆటో ఫోకస్‌తో కూడిన 8 ఎంపీ బ్యాక్ కెమెరాతో కూడా పని చేసే ఈ ఫోన్ సెల్ఫీ కోసం 5 ఎంపీ కెమెరాతో వస్తుంది. 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 7,040 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ట్యాబ్ 4 జీబీ +64 జీబీ వెర్షన్‌ను రూ. 18,999కి అందుబాటులో ఉంటుంది. అయితే నిపుణులు మాత్రం 8 జీబీ + 128 జీబీ వేరియంట్‌ను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.
యాపిల్ ఐ ప్యాడ్ 9
2021లో రిలీజ్ చేసిన యాపిల్ ఐ ప్యాడ్ 9వ జనరేషన్ ట్యాబ్ కూడా ఈ సేల్‌లో తక్కువ ధరలో అందుబాటులో ఉంది. యాపిల్ ఏ 13 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పని చేసే ఈ ట్యాబ్ 10.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్ ద్వారా పని చేస్తుంది. ఈ ఐప్యాడ్ బరువు 500 గ్రాములుగా ఉంది. అలాగే ఈ ఐ ప్యాడ్‌ను ఓఎస్ వీ17.3 తాజా వెర్షన్‌కి అప్‌డేట్ చేయవచ్చు. యాపిల్ అధికారికంగా ఈ ఐప్యాడ్ బ్యాటరీ సామర్థ్యాన్ని వెల్లడించనప్పటికీ 8,557 ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేస్తుందని నిపుణులు అంచనా ఈ సేల్‌లో ఈ యాపిల్ ఐప్యాడ్ 9ను కేవలం రూ.26,999కు సొంతం చేసుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








