Iphone 15: ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐ ఫోన్ 15పై నమ్మలేనంత తగ్గింపు
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఐఫోన్లకు ఉండే క్రేజ్ వేరు. ఫీచర్లతో పాటు భద్రతా పరంగా ఐఫోన్లు టాప్‌రేటెడ్‌గా ఉండడంతో ఎక్కువ మంది ఐఫోన్లను ఇష్టపడుతున్నారు. తాజాగా ఇటీవల రిలీజైన ఐ ఫోన్ 15పై భారతదేశంలోని యువత ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ యాపిల్ ఐ ఫోన్15పై ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15ని కేవలం రూ. 66,999కి పొందవచ్చు. ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 2023లో ప్రారంభించినప్పుడు దాని అసలు ధర రూ. 79,900 వరకూ ఉంది.

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల వాడకం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా యువత స్మార్ట్‌ఫోన్లల్లో వచ్చే వివిధ ఫీచర్లను అమితంగా ఇష్టపడుతున్నారు. గతంలో కేవలం ఫోన్లు, మెసేజ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండే ఫోన్లు ప్రతి చిన్న అవసరానికి తప్పనిసరయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఐఫోన్లకు ఉండే క్రేజ్ వేరు. ఫీచర్లతో పాటు భద్రతా పరంగా ఐఫోన్లు టాప్‌రేటెడ్‌గా ఉండడంతో ఎక్కువ మంది ఐఫోన్లను ఇష్టపడుతున్నారు. తాజాగా ఇటీవల రిలీజైన ఐ ఫోన్ 15పై భారతదేశంలోని యువత ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ యాపిల్ ఐ ఫోన్15పై ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15ని కేవలం రూ. 66,999కి పొందవచ్చు. ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 2023లో ప్రారంభించినప్పుడు దాని అసలు ధర రూ. 79,900 వరకూ ఉంది. బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్‌లను ఉపయోగించడం ద్వారా ఐఫోన్ 15పై ఎక్కువ డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 సిరీస్‌పై ఉన్న ఆఫర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసకుందాం.
ఫ్లిప్‌కార్ట్‌లో 128 జీబీ మోడల్‌ను కేవలం రూ. 66,999కి పొందవచ్చు. ఈ ఫోన్ అసలు ధర కంటే దాదాపు రూ. 13,000 తక్కువకు పొందవచ్చు. అలాగే 256 జీబీ, 512 జీబీ మోడల్‌లు కూడా వరుసగా రూ.76,999, రూ.96,999కి అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. అలాగే బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లను ఉపయోగించడం ద్వారా మరింత ఎక్కువ డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఏదైనా బ్యాంక్ కార్డ్‌తో ముందస్తుగా చెల్లిస్తే రూ. 2,000 తగ్గింపును అందిస్తోంది. అలాగే పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే రూ. 54,990 వరకు తగ్గింపును అందిస్తోంది. మీరు అదనపు సౌలభ్యం కోసం నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్‌లు, యూపీఐ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. ముఖ్యంగా మీరు ఐ ఫోన్ 15 కోసం ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ను ఎక్స్చేంచ్ చేసకుంటే రూ. 46149 తగ్గింపును పొందవచ్చు. అయితే మీ వద్ద ఐఫోన్ 12 వంటి పాత ఐఫోన్ ఉన్నప్పటికీ, మీరు దానిని ఎక్స్చేంజ్ చేయడం ద్వారా రూ. 20850 తగ్గింపును పొందవచ్చు. .ఐఫోన్ 15 ఐదు అద్భుతమైన రంగులలో వస్తుంది పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్. అయినప్పటికీ ప్రతి మోడల్‌కు అన్ని రంగులు స్టాక్‌లో లేవు. అలాగే లభ్యతను బట్టి ధరలు మారవచ్చు.
ఐఫోన్ 15 స్పెసిఫికేషన్స్
డిజైన్, డిస్‌ప్లే
ఐఫోన్ 15 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐఫోన్ 14తో దాని మునుపటి వెర్షన్‌లకు సమానమైన డిజైన్‌ను కలిగి ఉంది. గుర్తించదగిన మార్పు డైనమిక్ ఐలాండ్ నాచ్. ఇది గత సంవత్సరం ఐఫోన్ 14 ప్రో మోడల్‌ల ద్వారా మొదటిసారిగా పరిచయం చేశారు. సాధారణ నాచ్‌ను భర్తీ చేసింది.
కెమెరా
ఐఫోన్ 15 కొత్త 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా సెన్సార్‌తో దాని మునుపటి కంటే మెరుగైన కెమెరాను కలిగి ఉంది. ఐఫోన్ 14లో 12 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఉంది. ఐఫోన్ 15 తక్కువ కాంతి పరిస్థితుల్లో మెరుగైన చిత్రాలను తీయగలదు. మరింత వాస్తవిక బోకె ప్రభావాలను సృష్టించగలదు.
బ్యాటరీ
ఐఫోన్ 15లో ‘ఆల్ డే బ్యాటరీ’ ఉందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఒక రోజంతా ఉండవచ్చని ఆపిల్ తెలిపింది.
ప్రాసెసర్
ఐఫోన్ 15 మరింత శక్తివంతమైన, వేగవంతమైన ప్రాసెసర్ ఏ16 బయోనిక్‌ను కలిగి ఉంది, అయితే ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఏ 15 బయోనిక్ చిప్‌ను కలిగి ఉన్నాయి. ఇది ఏ16 కంటే తక్కువ సామర్థ్యం మరియు నెమ్మదిగా ఉంది.
టైప్ సీ చార్జింగ్
ఐఫోన్ 15 యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌తో వస్తుంది. ఇది ఇతర పరికరాల ద్వారా విస్తృతంగా ఉపయోగించవచ్చు. ఇకపై నిర్దిష్ట ఐఫోన్ ఛార్జర్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేదు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








