- Telugu News Photo Gallery Technology photos Apple introduce stolen device protection feature in iphone, Know about this feature
Iphone: దొంగలకు పాస్‌వర్డ్ తెలిసినా ఏం చేయలేరు.. ఐఫోన్‌లో అదిరిపోయే ఫీచర్
ప్రైవసీకి పెట్టింది పేరు యాపిల్. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ బ్రాండ్‌ను ఎక్కువ మంది ఉపయోగించడానికి ప్రైవసీ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ముఖ్యంగా సెలబ్రిటీలు మొదలు పొలిటిషియన్స్ ఈ బ్రాండ్‌ను ప్రైవసీ కోసమే ఉపయోగిస్తారు. ఇలా యూజర్లు భద్రతకు పెద్ద పీట వేసే యాపిల్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది..
Updated on: Jan 27, 2024 | 10:12 PM

యాపిల్ తన స్మార్ట్ ఫోన్ యూజర్ల భద్రత కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రైవసీకి పెద్ద పీట వేసే యాపిల్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

సాధారణంగా ఎవరైన దొంగలు ఫోన్‌ను కొట్టేస్తే అందులోని సమాచారం అంతా తెలిసిపోతుందనే భయం ఉంటుంది. అందుకే పాస్‌వర్డ్, స్క్రీన్ ప్యాట్రన్‌లను పెట్టుకుంటుంటారు. అయితే ఒకవేళ పాస్‌వర్డ్ తెలిసిపోయినా ఫోన్‌ను ఏం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి.

అచ్చంగా ఇలాంటి ఆలోచనలో నుంచే యాపిల్ కొత్త ప్రైవసీ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇందులో భాగంగానే 'స్టోలెన్ డివైజ్ ప్రొటెక్షన్' అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఐఫోన్‌తో పాటు ఐప్యాడ్‌ల్లోనూ ఈ ఫీచర్ అందుబాటులోకి చ్చింది.

యాపిల్ తెచ్చిన ఈ ఫీచర్ సహాయంతో పాస్‌వర్డ్ తెలిసి ఫోన్‌ను దొంగలించినా ఆపరేట్ చేయలరు. ఈ ఫీచర్‌ను ఆన్‌చేస్తే.. మీరు రెగ్యులర్ వెళ్లే ప్రదేశాలకు కాకుండా ఇతర ప్రదేశాల్లో ఫోన్‌ను ఆపరేట్ చేస్తే వెంటనే స్టోలెన్ డివైజ్ ప్రొటెక్షన్ యాక్టివేట్ అవుతుంది.

దీంతో సదరు ఫోన్ లేదా ఐప్యాడ్‌కు అదనం సెక్యూరిటీ యాడ్ అవుతుంది. ఆ తర్వాత డివైజ్‌ను యాక్సెస్ చేయాలంటే కచ్చితమైన ఫేస్ ఐడీని అందించాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ను యాపిల్ తన కొత్త ఐఓఎస్ వెర్షన్ 17.4లో అందుబాటులోకి తీసుకొచ్చింది.




