- Telugu News Photo Gallery Technology photos Motorola cuts prices on Moto Razr 40 Ultra smartphone, Check here for full details
Moto Razr 40 Ultra: మోటో ఫోల్డబుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఇలాంటి డీల్ ఇంకెప్పుడు రాదు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా తాజాగా మార్కెట్లోకి మోటో రేజ్ 40 అల్ట్రా పేరుతో స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను అందించిన విషయం తెలిసిందే. స్టన్నింగ్ లుక్‌తో, మంచి ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌పై తాజాగా కంపెనీ భారీ డిస్కౌంట్‌ను అందించింది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి..
Updated on: Jan 28, 2024 | 9:53 PM

మోటోరోలా ఇటీవల మార్కెట్లోకి మోటో రేజర్ 40 అల్ట్రా పేరుతో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. లాంచింగ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ. 89,999గా ఉంది. అయితే తాజాగా కంపెనీ ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 20 వేల డిస్కౌంట్‌ను ప్రకటించించింది.

దీంతో ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను రూ. 69,999కే సొంతం చేసుకునే అవకాశం లభించింది. అంతేకాకుండా మోటోరోలా మోటో రేజర్ 40 వెనీలా వెర్షన్ పై రూ .10,000 తగ్గింపును కూడా కంపెనీ అందిస్తోంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ వేరియంట్ రూ. 49,999కే సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్ల విషయానికొస్తే మోటో రేజర్ 40 అల్ట్రాలో 6.9 ఎఫ్ హెచ్ డీ+ పీఓఎల్ఈడీ ఎల్టీపీఓ మెయిన్ డిస్ ప్లేను అందించారు. 2640×1080 రిజల్యూషన్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ గరిష్ట బ్రైట్ నెస్ ఈ స్క్రీన్ సొంతం.

బయట స్క్రీన్ విషయానికొస్తే.. పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ డిస్‌ప్లే.. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో, 1100 నిట్స్ గరిష్ట బ్రైట్ నెస్‌ను అందిస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ సెట్ తో పనిచేస్తుంది. ఇది 8 జిబి ర్యామ్, 256 జిబి యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ తో లభిస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ముందు, వెనక భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ను అందించారు. అలాగే, 7000 సిరీస్ అల్యూమినియం ఫ్రేమ్‌ను ఏర్పాటు చేశారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో.. 33 వాట్ ఛార్జర్ ద్వారా వేగంగా ఛార్జ్ చేయగల 3,800 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.




