Smart phones: తక్కువ బడ్జెట్‌లో మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా.?
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారు కెమెరా క్లారిటీపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కెమెరా పనితీరు ఆధారంగా ఫోన్ కొనుగోలు చేసే వారు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం మంచి కెమెరా క్లారిటీ ఉన్న ఫొటోలను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. మరి ప్రస్తుతం మార్కెట్లో రూ. 15వేల లోపు, మంచి కెమెరా క్లారిటీతో అందుబాటులో ఉన్న కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
Updated on: Jan 27, 2024 | 10:08 PM

మంచి కెమెరా క్లారిటీతో రూ. 15 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో ఇన్‌ఫీనిక్స్ హాట్ 30 5జీ స్మార్ట్ ఫోన్ ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే ఇందులో సెల్ఫీలు, వీడియోల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్ రూ. 12,499కి లభిస్తోంది.

రూ. 15వేలోపు లభిస్తున్న బెస్ట్ కెమెరాతో వస్తున్న స్మార్ట్ ఫోన్ ఇన్‌ఫీనిక్స్ నోట్ 30 5జీ స్మార్ట్ ఫోన్. ఇందులో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా, సెల్ఫీలు, వీడియోల కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

మోటోరోలా కంపెనీకి చెందిన మోటో జీ54 5జీ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే బేస్ వేరియంట్ రూ. 13,999కి లభిస్తోంది. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

పోకో ఎక్స్5 5జీ స్మార్ట్ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాతో పాటు.. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

రియల్‌మీ 11ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ ధర విషయానికొస్తే బేస్ వేరియంట్ రూ. 14,299గా నిర్ణయించారు.




