Whatsapp: మీ వాట్సాప్‌ స్టేటస్‌ను ఫ్రెండ్స్‌కి షేర్‌ చేయడం చాలా సింపుల్‌.. కొత్త ఫీచర్‌

మార్కెట్లో ఎన్నో మెసేజింగ్ యాప్స్‌ ఉన్నా వాట్సాప్‌కు మాత్రం ఆదరణ తగ్గడం లేదు. మరీ ముఖ్యంగా వాట్సాప్‌ ఇటీవల వరుసగా కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటికే మెటా ఏఐ పేరుతో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను పరిచయం చేసిన వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫీచర్‌ ఏంటి.? దీంతో కలిగే ప్రయోజనాలు

Whatsapp: మీ వాట్సాప్‌ స్టేటస్‌ను ఫ్రెండ్స్‌కి షేర్‌ చేయడం చాలా సింపుల్‌.. కొత్త ఫీచర్‌
Whatsapp
Follow us

|

Updated on: Apr 23, 2024 | 11:21 AM

రోజురోజుకీ యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మేసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి క్రేజ్‌ దక్కింది.

మార్కెట్లో ఎన్నో మెసేజింగ్ యాప్స్‌ ఉన్నా వాట్సాప్‌కు మాత్రం ఆదరణ తగ్గడం లేదు. మరీ ముఖ్యంగా వాట్సాప్‌ ఇటీవల వరుసగా కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటికే మెటా ఏఐ పేరుతో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను పరిచయం చేసిన వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫీచర్‌ ఏంటి.? దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వాట్సాప్‌లో ఎక్కువ ప్రాముఖ్యత పొందిన వాటిలో స్టేటస్‌ ఆప్షన్ ఒకటి. కొన్ని సందర్భాల్లో మనం పెట్టిన స్టేటస్‌ నచ్చి మిత్రులు సదరు వీడియోను పంపించమని కోరుతుంటారు. అయితే ఇందుకోసం వారి చాట్ ఓపెన్‌ చేసి అటాచ్‌మెంట్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకొని, సదరు వీడియోను సెండ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇంతకీ నేరుగా వాట్సాప్‌ స్టేటస్‌ను ఎలా ఫార్వర్డ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనం పోస్ట్ చేసిన స్టేటస్‌ ఓపెన్‌ చేసి చూస్తే. మన స్టేటస్‌ను ఎవరెవరు చూశారో చెక్‌ చేసుకోవడానికి వీడియోను పైకి స్లైడ్ చేస్తాం. అక్కడే స్టేటస్‌ను డిలీట్ చేసే ఆప్షన్‌ కనిపిస్తుంది. అయితే తాజాగా వాట్సాప్‌ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌లో ఫార్వర్డ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఫార్వర్డ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయగానే వెంటనే మీ రీసెంట్ చాట్‌ లిస్ట్‌ కనిపిస్తుంది. మీరు ఎవరికి వీడియో పంపాలనుకుంటున్నారో వారి చాట్‌ను సెలక్ట్‌ చేసుకుని సెండ్ నొక్కితే సరిపోతుంది. వెంటనే వారికి మెసేజ్‌ వెళ్లిపోతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?