Whatsapp: వాట్సాప్ గుడ్ న్యూస్..జూమ్, గూగుల్ మీట్ తరహా రానున్న మరో కొత్త ఫీచర్

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. ఇటీవల చాట్ లాక్, మెసేజ్ ఎడిట్ లాంటి ఫీచర్లు తీసుకొచ్చిన వాట్సాప్ త్వరలోనే వీడియో కాలింగ్‌లో స్క్రీన్ షేరింగ్ ఆప్షన్‌ను తీసుకురానుంది. ఇదివరకు గూగుల్ మీట్, జూమ్ లాంటి యాప్స్‌లో ఇలాంటి ఫీచర్ అందుబాటులో ఉంది.

Whatsapp: వాట్సాప్ గుడ్ న్యూస్..జూమ్, గూగుల్ మీట్ తరహా రానున్న మరో కొత్త ఫీచర్
Whatsapp
Follow us

|

Updated on: May 27, 2023 | 9:09 PM

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. ఇటీవల చాట్ లాక్, మెసేజ్ ఎడిట్ లాంటి ఫీచర్లు తీసుకొచ్చిన వాట్సాప్ త్వరలోనే వీడియో కాలింగ్‌లో స్క్రీన్ షేరింగ్ ఆప్షన్‌ను తీసుకురానుంది. ఇదివరకు గూగుల్ మీట్, జూమ్ లాంటి యాప్స్‌లో ఇలాంటి ఫీచర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు తాజాగా ఇలాంటి సుదుపాయంతోనే వాట్సాప్ ముందుకొస్తుంది. ప్రస్తుతానికి కొందరు బీటా టెస్టర్లుకు ఈ ఫీచర్ అందుబాటులో ఉందని.. త్వరలోనే యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ ఇన్ఫో తెలిపింది.

ఎవరితోనైనా వీడియో కాల్‌ మాట్లాడేటప్పుడు మన మొబైల్‌ స్క్రీన్‌ను అవతలి వ్యక్తులకు షేర్‌ చేయడమే ఈ ఆప్షన్‌ ఉద్దేశం. ఇందుకోసం స్క్రీన్‌ అడుగు భాగంలో కొత్తగా స్క్రీన్‌ షేరింగ్‌ బటన్‌ను వాట్సాప్‌ ఇస్తోంది. ఇక ఈ బటన్‌ను నొక్కితే మీ ఫోన్‌లో చేసే ప్రతీది రికార్డు అవ్వడంతో పాటు అవతలి వ్యక్తికి కూడా అది షేర్‌ అవుతుంది.అయితే దీనికి యూజర్‌ అనుమతి తప్పనిసరిగా ఉంటుంది.మరో విషయం ఏంటంటే పాత ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ ఉన్న ఫోన్లలోనూ, పాత వాట్సాప్‌ వెర్షన్లలోనూ ఈ ఫీచర్‌ పనిచేయకపోవచ్చు. అలాగే ఎక్కువ మంది గ్రూప్‌ వీడియో కాలింగ్‌‌లో మాట్లాడుతున్నప్పుడు కూడా స్క్రీన్‌ షేరింగ్‌ ఫీచర్‌ పనిచేయకపోవచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..