Whatsapp: భారత్‌లో 26 లక్షల అకౌంట్స్‌ను నిషేధించిన వాట్సాప్.. కారణమేంటంటే..
ఫేక్ వార్తల వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంటున్న విషయం తెలిసిందే. అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయడానికి, తప్పుడు సమచారాన్ని నిషేధించడానికి వాట్సాప్ గత కొన్ని రోజులుగా పలు ఖాతాలను నిషేధిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా భారత్‌లో ఏకంగా..

ఫేక్ వార్తల వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంటున్న విషయం తెలిసిందే. అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయడానికి, తప్పుడు సమచారాన్ని నిషేధించడానికి వాట్సాప్ గత కొన్ని రోజులుగా పలు ఖాతాలను నిషేధిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా భారత్‌లో ఏకంగా 26 లక్షల 85 వేల ఖాతాలను నిషేధించింది. సెప్టెంబర్ 30 వరకు వాట్సాప్ ఈ ఖాతాలను బ్యాన్ చేసింది. వీటిలో దాదాపు 8 లక్షలకు పైగా వాట్సాప్ అకౌంట్లను ఎలాంటి ఫిర్యాదులు రాకముందే తొలగించినట్లు వాట్సాప్ తెలిపింది.
దీంతో పాటు భారత ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా లక్షలాదిగా వాట్సాప్ అకౌంట్లను నిషేధించింది. ఈ విషయమై మెటా సంస్థ 2022 సెప్టెంబర్ యూజర్ సేఫ్టీ రిపోర్ట్‌ను భారత ఐటీ మంత్రిత్వ శాఖకు అందించింది. దీంతోపాటు వాట్సాప్ ఖాతాలను ఉపయోగిస్తున్న వారిపై 666 ఫిర్యాదులు అందగా, 23 మందిపై మాత్రమే చర్యలు తీసుకున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. వాట్సాప్ దుర్వినియోగం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న తెలిపిన మెటా.. ఇందులో భాగంగానే యూజర్ల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది.
ఇక యూజర్ల భద్రతకు తాము పెద్ద పీట వేస్తున్నామని చెప్పిన వాట్సాప్ ఇందులో భాగంగానే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మేసేజింగ్ సిస్టమ్‌ను ధీటుగా రూపొందించామని తెలిపారు. యూజర్ల సెక్యూరిటీ కోసం తమ ఇంజనీర్లు, డేటా సైంటిస్టుటు, చట్ట నిపుణులు కష్టపడి పని చేస్తున్నారని వాట్సాప్ తెలిపింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..







