WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఎంత పెద్ద ఫైల్ అయినా ఇట్టే పంపించొచ్చు..

వాట్సాప్ లో ఓ వెలితి అలాగే ఉండిపోయింది. అదేంటి అంటే పెద్ద ఫైళ్లను పంపించలేకపోవడం. ఈ సమస్యకు వాట్సాప్ చెక్ పెట్టింది. ఇక పై పెద్ద ఇమేజ్లు, ఆడియో ఫైళ్లు, వీడియోలు, వాయిస్ నోట్లు అన్ని 2జీబీ(2000ఎంబీ) వరకూ పంపుకోవచ్చని ప్రకటించింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఎంత పెద్ద ఫైల్ అయినా ఇట్టే పంపించొచ్చు..
Whatsapp
Follow us

|

Updated on: May 30, 2023 | 8:30 AM

వాట్సాప్.. జనాలకు బాగా కనెక్ట్ అయిపోయింది. అది లేకుండా జనాలకు రోజు పూర్తవదు. దానిలో ఉండే పీచర్స్, గ్రూప్స్ జనాల్లోకి వెళ్లిపోయాయి. అయితే ఎన్ని ఫీచర్లు, అప్ డేట్లు వచ్చినా వాట్సాప్ లో ఓ వెలితి అలాగే ఉండిపోయింది. అదేంటి అంటే పెద్ద ఫైళ్లను పంపించలేకపోవడం. వాట్సాప్ కేవలం 16ఎంబీ లోపు ఉండే ఫైళ్లను మాత్రమే షేర్ చేసేందుకు అనుమతి ఇస్తుంది. అంతకు మించిన ఫైళ్లను వేరే వాళ్లకు పంపాలంటే దాని కోసం జీమెయిల్ గానీ మరో ఇతర సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను కానీ వినియోగిస్తుంటాం. అయితే ఈ సమస్యలకు వాట్సాప్ చెక్ పెట్టింది. ఇక పై పెద్ద ఇమేజ్లు, ఆడియో ఫైళ్లు, వీడియోలు, వాయిస్ నోట్లు అన్ని 2జీబీ(2000ఎంబీ) వరకూ పంపుకోవచ్చని ప్రకటించింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

వాట్సాప్ ఫైల్ సైజ్ లిమిట్..

వాట్సాప్ ద్వారా విస్తృత సంఖ్యలో ఫొటోలు, వీడియోలు షేర్ అవుతాయి. అవి పెద్ద సైజ్లో ఉంటే వినియోగదారుల ఫోన్ స్టోరేజ్ త్వరగా అయిపోయే అవకాశం ఉంది. అందుకే వాట్సాప్ ఇంతకాలం పెద్ద ఫైళ్లను అనుమతించలేదు. అయితే వినియోగదారుల అభ్యర్థనల మేరకు వాట్సాప్ ఇప్పుడు ఫైల్ సైజ్ లిమిట్ ని సవరించింది. ఇప్పుడు 2జీబీ వరకూ ఉండే ఫైల్ ఏదైనా వాట్సాప్ నుంచి పంపించుకోవచ్చు. అది ఆండ్రాయిడ్, ఐఓఎస్, ల్యాప్ టాప్, డెస్క్ టాప్ దేనిలో అయినా ఇదే సైజ్ లో పంపుకోవచ్చు.

ఆండ్రాయిడ్ లో ఇలా పంపించుకోవచ్చు..

  • మొదటిగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి లేటెస్ట్ వెర్షన్ వాట్సాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • చాట్ స్క్రీన్ ని ఓపెన్ చేసి మీరు ఫైల్ పంపాలనుకొంటున్న కాంటాక్ట్ లేదా గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోండి.
  • అటాచ్ మెంట్ ఐకాన్ పై క్లిక్ చేసి, టెక్ట్స్ బాక్స్ లో డ్యాక్యుమెంట్ ఐకాన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన ఫైల్ ని 2 జీబీ వరకూ సైజ్లో ఎంపిక చేసుకోవచ్చు.
  • ఫైల్ ఎంపిక చేసుకొన్నతర్వాత అది కన్ఫర్మేషన్ అడుగుతుంది. అది చేసి సెండ్ బటన్ పై క్లిక్ చేయండి. అది అప్ లోడ్ అవడానికి కొద్ది సమయం పడుతుంది. మీ నెట్ వర్క్ స్పీడ్ ని ఇది ఆధారపడి ఉంటుంది.

ఐఓఎస్ లో ఇలా..

  • ఐఫోన్ లోకి వెళ్లి ఫొటోస్ యాప్ ని ఓపెన్ చేయాలి.
  • మీరు పంపాలనుకొంటున్న వీడియో లేదా ఇమేజ్ ని ఎంపిక చేసుకోండి.
  • ఆ తర్వాత ‘షేర్’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • అనంతరం సేవ్ టు ఫైల్స్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి.
  • ఆ తర్వాత వాట్సాప్ లోకి వెళ్లి ఎడమచేతి వైపు ఉన్న ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసి, దానిలో డాక్యుమెంట్ ఆప్షన్ ని ఎంపిక చేసుకోవాలి.
  • దానిలో చూపించిన ఫైల్స్లో మీకు కావాల్సిన ఫైల్ ను ఎంపిక చేసుకొని సెండ్ చేయాలి.

కంప్యూటర్ లో ఇలా..

  • మొదటిగా మీ కంప్యూటర్ లో వాట్సాప్ లో లాంచ్ చేయండి.
  • చాట్స్ లోకి వెళ్లి అటాచ్ మెంట్ బాక్స్ పై క్లిక్ చేయండి.
  • దానిలో డాక్యుమెంట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత దానిలో మీకు కావాల్సిన ఫైల్ ని ఎంపిక చేసుకొని ఓకే బటన్ పై క్లిక్ చేయండి.
  • అయితే 100ఎంబీ వరకూ మాత్రమే ఫైల్ సైజ్ ను ఇది అనుమతిస్తుంది. పెద్ద ఫైళ్ళను పంపాలనుకొంటే వాటిని డ్రాప్ బాక్స్, గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్, మెగా డ్రైవ్, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ వంటి వాటి ద్వారా పంపించుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి