AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chat GPT: మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌కు ఆరోగ్యకరమైన టిఫిన్ ఏంటి? చాట్ జీపీటీ ఇచ్చిన వింత ఆన్సర్..

ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌లపై సూచనలు, ఆలోచనల కోసం చూసే కొందరు చాలాసార్లు ప్రముఖులు పంచుకునే వంటకాలపై దృష్టి పెడతారు. ఇలాంటి నేపథ్యంలో కొంతమంది ఆరోగ్యకరమైన అల్పాహారం గురించి చాట్ జీపీటీను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చాట్ జీపీటీ చాలా చిత్రమైన సమాధానం ఇచ్చింది.

Chat GPT: మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌కు ఆరోగ్యకరమైన టిఫిన్ ఏంటి? చాట్ జీపీటీ ఇచ్చిన వింత ఆన్సర్..
Chatgpt
Nikhil
| Edited By: Janardhan Veluru|

Updated on: Apr 11, 2023 | 11:27 AM

Share

ప్రస్తుతం ప్రపంచం మొత్తం చాట్ జీపీటీ ట్రెండ్ నడుస్తుంది. మనం అడిగే ప్రశ్నలకు చాట్ జీపీటీ ఎలాంటి ఆన్సర్ ఇస్తుందని అనే విషయాలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇటీవల కోర్టులో కూడా తీర్పు విషయంలో చాట్ జీపీటీని అడిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో చాట్ జీపీటీ ఎలాంటి సమాధానలు ఇస్తుందో? తెలుసుకోవడానికి కొంత మంది ఔత్సాహికులు ప్రయత్నిస్తున్నారు. తరచుగా ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌లపై సూచనలు, ఆలోచనల కోసం చూసే కొందరు చాలాసార్లు ప్రముఖులు పంచుకునే వంటకాలపై దృష్టి పెడతారు. ఇలాంటి నేపథ్యంలో కొంతమంది ఆరోగ్యకరమైన అల్పాహారం గురించి చాట్ జీపీటీను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చాట్ జీపీటీ చాలా చిత్రమైన సమాధానం ఇచ్చింది. కేవలం ఒక్క ఆహార పదార్థమే కాకుండా వివిధ ఆహార పదార్థాలను అల్పాహారం కింద సూచనలు చేసింది. చాట్ జీపీటీ చెప్పిన ఆ ఆహార పదార్థాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం. శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన అల్పాహారం అందించడానికి ఆయా ఆహారాల్లో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు అవసరమైతే ఇతర ఆహారాలతో కలిపి తీసుకోవాలని చాట్ జీపీటీ సూచించింది. 

చాట్ జీపీటీ సూచించే ఆహరా పదార్థాలు ఇవే

తృణధాన్యాలు 

తృణధాన్యాలతో చేసిన రొట్టెలు లేదా ఫైబర్ అధికంగా ఉండే వోట్స్‌ని ఎంచుకోవాలని చాట్ జీపీటీ సూచించింది. ఎందుకంటే ఇవి స్థిరమైన శక్తిని అందిస్తాయి. శుద్ధి చేసిన ధాన్యాలతో చక్కెర అధికంగా ఉండే తృణధాన్యాలు మానుకోవాలని సూచించింది.

ప్రోటీన్ 

గుడ్లు, పెరుగు, చీజ్‌తో పాటు గింజలు/విత్తనాలు వంటి ప్రోటీన్ మూలాన్ని అల్పాహారంలో చేర్చాలని చాట్ జీపీటీ సూచించింది. ప్రోటీన్ మీ కడుపును ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే కండరాల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

పండ్లు, కూరగాయలు

పండ్లు, కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలతో పాటు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి మీ అల్పాహారంలో బెర్రీలు, అరటిపండ్లు, అవకాడో, బచ్చలికూర లేదా టమోటాలు జోడించడానికి ప్రయత్నించాలని సూచించింది.

ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు

గింజల ఆహారం, అవకాడోలు లేదా వెన్న వంటి ఆరోగ్యకరమైన కొవ్వుల మూలాలను అల్పాహారంలో చేర్చాలి. ఎందుకంటే మెదడు ఆరోగ్యంతో పాటు శరీర శ్రేయస్సు కోసం ఆరోగ్యకరమైన కొవ్వులు ముఖ్యమైనవని చాట్ జీపీటీ తెలిపింది.

పాల పదార్థాలు

ప్రతి రోజూ అల్పాహారం సమయంలో పాల పదార్థాలు ఉండేలా చూసుకోవాలని చాట్ జీపీటీ సూచించిది. ఒకవేళ ఎవరికైనా లాక్టోస్ అసహసం ఉంటే లేదా నాన్-డైరీ ఎంపికలను ఇష్టపడితే బాదం పాలు, కొబ్బరి పాలు లేదా సోయా మిల్క్‌ని ప్రయత్నించాలని సూచించింది.

హైడ్రేట్

ముఖ్యంగా వేసవిలో హైడ్రేట్‌గా ఉండడానికి అధికంగా నీరు తాగాలని సూచించింది. ముఖ్యంగా హెర్బల్ టీ తాగినా ఇబ్బంది ఉండదని సూచించింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..