AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asus laptops: మార్కెట్‌లోకి కొత్త ల్యాప్‌టాప్‌లు.. పనితీరు చూస్తే అదుర్స్ అనాల్సిందే..!

నేటి కాలంలో ప్రతి పనికీ కంప్యూటర్ అత్యంత అవసరమైంది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా దీని వాడకం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో మినీ కంప్యూటర్లు భావించే ల్యాప్ టాప్ లకు డిమాండ్ ఎక్కువైంది. వీటిని ఇల్లు, కార్యాలయం ఇలా అన్ని ప్రాంతాల్లో చక్కగా వినియోగించుకోవచ్చు. చిన్న బ్యాగులో పెట్టుకుని ఎక్కడికైనా చాలా సులభంగా తీసుకువెళ్లవచ్చు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక ల్యాప్ టాప్ లు మార్కెట్ లో వస్తున్నాయి. దీనిలో భాగంగా ప్రముఖ కంపెనీ అసుస్ తన వీవోబుక్ లైనప్ లో రెండు కొత్త ల్యాప్ టాప్ ను విడుదల చేసింది. ఈ ధరలు, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.

Asus laptops: మార్కెట్‌లోకి కొత్త ల్యాప్‌టాప్‌లు.. పనితీరు చూస్తే అదుర్స్ అనాల్సిందే..!
Asus Vivobook S14
Nikhil
|

Updated on: Apr 25, 2025 | 5:45 PM

Share

ఆసస్ నుంచి విడుదలైన వివిధ మోడళ్ల ల్యాప్ టాప్ లు ప్రజల అభిమానం పొందాయి. ప్రస్తుతం మరో రెండు కొత్త మోడళ్లు దేశంలోని విడుదల అయ్యాయి. వీవోబుక్ ఎస్ 14 (S3407VA), వివోబుక్ ఎస్ 14 ఫ్లిప్ (TP3402VAO) అనే పేర్లతో పిలిచే ఈ ల్యాప్ టాప్ లు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగంగా ఉంటాయి. వీటిలో 13వ జనరేషన్ ఇంటెల్ హెచ్ సిరీస్ ప్రాసెసర్లు ఏర్పాటు చేశారు. రూ.67,990 నుంచి అందుబాటులో ఉన్నాయి.

వివోబుక్ ఎస్ 14 ల్యాప్ టాప్ ప్రత్యేకతల విషయానికి వస్తే ఇంటెల్ కోర్ ఐ7 – 1360హెచ్ ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ, 14 అంగుళాల ఎఫ్ హెచ్డీ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. షట్టర్ తో కూడిన ఎఫ్ హెచ్డీ ఐఆర్ కెమెరా, డాల్బీ ఆట్మోస్ స్టిరియో స్పీకర్లు, 70 డబ్ల్యూహెచ్ఆర్ బ్యాటరీ అమర్చారు. 65 డబ్ల్యూ ఫాస్ట్ చార్జర్ తో వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం 1.4 కిలోల బరువైన ఈ ల్యాప్ టాప్ ధర రూ.67,990 నుంచి ప్రారంభమవుతుంది.

వీవోబుక్ ఎస్14 ఫ్లిప్ ల్యాప్ టాప్ లోని 14 అంగుళాల ఎఫ్ హెచ్డీ డిస్ ప్లేతో విజువల్ చాలా స్పష్టంగా ఉంటుంది. ఇంటెల్ కోర్ ఐ5-13420హెచ్ ప్రాసెసర్, 16 జీబీ, 512 బీజీ స్టోరేజీ, కెమెరా బాగున్నాయి. 90 డబ్ల్యూకు మద్దతు ఇచ్చే 50 డబ్ల్యూహెచ్ఆర్ బ్యాటరీ, కనెక్టివిటీ కోసం పోర్టులు ఏర్పాటు చేశారు. ఈ ల్యాప్ టాప్ బరువు 1.5 కిలోలు మాత్రమే. ఎక్కడికైనా చాలా సులభంగా తీసుకువెళ్లవచ్చు. దీని ధర రూ.69,990 నుంచి మొదలవుతుంది.

ఇవి కూడా చదవండి

వివోబుక్ ఎస్ 14 ల్యాప్ టాప్ అల్ట్రా స్లిమ్ మెటల్ డిజైన్ తో ఆకట్టుకుంటోంది. మంచి డిస్ ప్లే, డాల్బీ అట్మాస్ స్పీకర్లు, ఎక్కువ కాలం మన్నిక దీని ప్రత్యేకతలు. ఈ ల్యాప్ టాప్ ను అసుస్ ఈ షాప్, ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. ఒక వివోబుక్ ఎస్ 14 ఫ్లిప్ మోడల్ ల్యాప్ టాప్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది. అసుస్ ఎక్స్ క్లూజివ్ స్టోర్లు, పెద్ద ఫార్మాట్ రిటైల్ చైన్లు, బహుళ బ్రాండ్ల అవుట్ లెట్లలో లభిస్తుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి